సీసాల్లో నీరు పోసి అమ్ముతున్న వైన్స్‌ సీజ్‌

ABN , First Publish Date - 2021-08-11T04:59:16+05:30 IST

సీసాల్లో నీరు పోసి అమ్ముతున్న వైన్స్‌ సీజ్‌

సీసాల్లో నీరు పోసి అమ్ముతున్న వైన్స్‌ సీజ్‌

ఆమనగల్లు: ఆమనగల్లులోని శ్రీ సత్యసాయి వైన్‌షాప్‌ను మంగళవారం ఎక్సైజ్‌ అధికారులు సీజ్‌ చేశారు. ఎక్సైజ్‌ సీఐ వేణుకుమార్‌ చెప్పిన వివరాల ప్రకారం.. సత్యసాయి వైన్స్‌లో ఆఫీసర్స్‌ చాయిస్‌ బ్రాండ్‌ 750ఎంఎల్‌ బాటిల్‌లో నీరు పోసి అమ్ముతున్నట్టు ఫిర్యాదులొచ్చాయన్నారు. టాస్క్‌ఫోర్స్‌, స్థానిక అధికారులు వైన్‌షాప్‌ను తనిఖీ చేశారు. ఆ ఫీసర్స్‌ చాయిస్‌ బ్రాండ్‌లో నీళ్లు పోసి అమ్ముతున్న ట్లు గుర్తించారు. ఇలా 24మద్యం నకిలీ మద్యం సీ సాలను స్వాధీనం చేసుకున్నారు. దుకాణంలో పని చేసే దిలీ్‌పచక్రవర్తి, మల్లేశ్‌, సత్యనారాయణ, ఆర్‌.మహేశ్‌ మద్యంలో నీరు పోసి అమ్ముతున్నట్టు అంగీకరించారని అధికా రి తెలిపారు.ముగ్గురిపై కేసు నమోదు చేసి మద్యం దుకాణాన్ని సీజ్‌ చేశామని వేణుకుమార్‌ తెలిపా రు. మద్యాన్ని కల్తీ చేసి అమ్మితే కఠిన చర్యలు త ప్పవని, రూ.3లక్షల జరిమానా విధిస్తామని వేణుకుమార్‌ తెలిపారు. తదుపరి ఉత్తర్వులొచ్చే వరకు ఈ దుకాణం సీజ్‌లోనే ఉంటుందన్నారు. జిల్లా అధికారి స్టీవెన్‌సన్‌, ఎస్సై వేణుమాధవ్‌, మసూద్‌, న ర్సింగ్‌రావు,రాజిరెడ్డి, మోహన్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-08-11T04:59:16+05:30 IST