పాఠశాలలను సిద్ధం చేయాలి
ABN , First Publish Date - 2021-08-26T04:19:28+05:30 IST
పాఠశాలలను సిద్ధం చేయాలి

- చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య
- పాఠశాలల పునః ప్రారంభంపై సమీక్ష
చేవెళ్ల/యాచారం/ మాడ్గుల/శంషాబాద్: ఈ నెలాఖరుకల్లా అన్ని పాఠశాలలు, కళాశాలలను సిద్ధం చేయాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అధికారులు, ప్రజాప్రతినిధులకు సూచించారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చేవెళ్ల డివిజన్ స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులతో పాఠశాలలు, కళాశాలల ప్రారంభంపై సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం విద్యాసంస్థలను ప్రారంభించేందుకు కసరత్తు చేస్తుందని, చేవెళ్ల డివిజన్ పరిధిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో శానిటైజేషన్ చేయించాలన్నారు. విద్యార్థులందరూ కొవిడ్ నిబంధనలు పాటించేలా వైద్యసిబ్బంది చొరవ తీసుకోవాలన్నారు. నిర్లక్ష్యం వహిస్తే అధికారులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎమ్మెల్యే హెచ్చరించారు. సమావేశంలో ఎంపీపీలు విజయలక్ష్మి, నక్షత్రం, గోవర్థన్‌రెడ్డి, ప్రశాంతి, జడ్పీటీసీ మాలతి, ఎంపీడీవోలు హరీ్‌షకుమార్, సత్తయ్య, విజయలక్ష్మి, అధికారులు పాల్గొన్నారు. పాఠశాలల్లో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాలని ఎంపీపీ విజయలక్ష్మి అన్నారు. బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో ఉపాధ్యాయులు, అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ... పాఠశాలల్లో పిచ్చిమొక్కలు తొలగించి, శానిటేషన్ చేయించాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో హరీ్‌షకుమార్, విఠలేశ్వర్ పాల్గొన్నారు. యాచారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ సుకన్య బుధవారం పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పలు సూచనలు చేశారు. మాడ్గుల మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో పారిశుధ్య పనులు వెంటనే చేపట్టాలని ఎంపీపీ పద్మా ఆదేశించారు. బుధవారం పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలని తెలిపారు. అదే విధంగా గ్రామాల్లోనూ పారిశుధ్య పనులను చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో ఫారూఖ్‌హుస్సేన్, విజయభాస్కర్, తదితరులు పాల్గొన్నారు. శంషాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో పాఠశాలల పునః ప్రారంభంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. సమావేశంలో ఎంపీపీ జయమ్మశ్రీనివాస్, జడ్పీటీసీ నీరటి తన్వీరాజు తదితరులు పాల్గొన్నారు.