సాయిగీతాశ్రమంలో సర్వదోష నివారణ మహాయజ్ఞం

ABN , First Publish Date - 2021-12-27T05:07:05+05:30 IST

సాయిగీతాశ్రమంలో సర్వదోష నివారణ మహాయజ్ఞం

సాయిగీతాశ్రమంలో సర్వదోష నివారణ మహాయజ్ఞం
మహాయజ్ఞంలో పాల్గొన్న మంత్రి మల్లారెడ్డి

మేడ్చల్‌: గుండ్లపోచంపల్లి మున్సిపల్‌ పరిధిలోని సాయిగీతాశ్రమంలో ఆదివారం సర్వదోష నివారణ మహాయజ్ఞం నిర్వహించారు. లోకశాంతికి ప్రతీ  ఏడాది డిసెంబరు నెలాఖరి ఆదివారం ఆశ్రమంలో ఈ మహాయజ్ఞాన్ని నిర్వహిస్తారు.  కాగా వారం రోజులుగా ఆశ్రమంలో రుద్రహోమం, పంచముఖ ఆంజనేయ హోమం, రుణవిమోచన గణపతి హోమం, సాయిసద్గురు హోమం, శ్రీమహాలక్ష్మీయజ్ఞం, శనిశాంతి హోమం, ఆదిత్య ఆయుష్యహోమంతదితర కార్యక్రమాలు నిర్వహించారు. ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటలకు సామూహికంగా భక్తులందరిచే కొబ్బరికాయలు కొట్టించారు. అంతకుముందు సాయికుమార్‌బాబా విశ్వశాంతి కోసం ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించడంతో పాటు భక్తులకు ప్రవచనాలు వినిపించారు.  కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి, కాసాని జ్ఞానేశ్వర్‌, యాంకర్‌రవిలతో  పాటు పలువురు ప్రముఖులు, స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, భక్తులు పూజల్లో పాల్గొన్నారు.  

Updated Date - 2021-12-27T05:07:05+05:30 IST