ఎన్‌ఎస్‌ఎస్‌ ఉత్తమ ప్రోగ్రాం అధికారిగా సరిత

ABN , First Publish Date - 2021-12-08T05:42:38+05:30 IST

ఎన్‌ఎస్‌ఎస్‌ ఉత్తమ ప్రోగ్రాం అధికారిగా సరిత

ఎన్‌ఎస్‌ఎస్‌ ఉత్తమ ప్రోగ్రాం అధికారిగా సరిత

ఇబ్రహీంపట్నం: కేంద్ర ప్రభుత్వ యువజన మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో జాతీయ సేవా పథకం (ఎన్‌ఎస్‌ఎస్‌) రాష్ట్రస్థాయి ఉత్తమ ప్రోగ్రాం అధికారిగా గంగాపురం సరిత ఎంపికయ్యారు. ఈమేరకు రాష్ట్ర యువజన క్రీడల కార్యదర్శి నవీన్‌ మిట్టల్‌ ప్రకటన విడుదల చేశారు. 2017-18 సంవత్సరానికి గానూ కేటగిరి-2లో ఆరుగురికి ఈఅవార్డులు దక్కాయి. అప్పట్లో ఇబ్రహీంపట్నం గురునానక్‌ ఇంజనీరింగ్‌ కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించిన వివిధ కార్యక్రమాలకు సరిత ప్రోగ్రాం ఆఫీసర్‌గా విధులు నిర్వర్తించారు. కాగా 2022 జనవరిలో గవర్నర్‌ చేతుల మీదుగా ఆమె ఈ అవార్డు అందుకోనున్నారు.  

Updated Date - 2021-12-08T05:42:38+05:30 IST