ఉత్పత్తికి అనుగుణంగా విక్రయాలు చేపట్టాలి

ABN , First Publish Date - 2021-10-22T05:00:39+05:30 IST

ఉత్పత్తికి అనుగుణంగా విక్రయాలు చేపట్టాలి

ఉత్పత్తికి అనుగుణంగా విక్రయాలు చేపట్టాలి

  • కేంద్ర సీసీఐ కర్మాగారాల సీఎండీ సంజయ్‌ బంగా

తాండూరు రూరల్‌: కరన్‌కోట్‌ ప్రభుత్వ రంగ సిమెంటు కర్మాగారాన్ని కేంద్ర సిమెంట్‌ కర్మాగారాల చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సంజయ్‌బంగా గురువారం ఆకస్మిక తనిఖీ చేశారు. కర్మాగారంలోని క్రషర్‌, రామిల్‌, కిలన్‌, ప్యాకింగ్‌ ప్లాంట్‌, కోల్‌మిల్‌, మైన్స్‌ తదితర ప్రాంతాల్లో పర్యటించారు. యంత్రాల పనితీరును, ఉత్పత్తి, మార్కెటింగ్‌ విషయాలపై జనరల్‌ మేనేజర్‌ వివేక్‌కుమార్‌ను అడిగి తెలుసుకున్నారు. సిమెంటు ఉత్పత్తులకు అనుగుణంగా విక్రయాలు చేపట్టాలని ఆదేశించారు. ప్రతి రోజు ఉత్పత్తి, విక్రయాలు ఎంత వరకు చేపడుతున్నారనే విషయాలపై పీఎన్‌డీ సెక్షన్‌లో హెచ్‌వోడీలతో సమీక్షించారు. ఏడాదికి పది లక్షల మెట్రిక్‌ టన్నుల సిమెంట్‌ను ఉత్పత్తి చేయాలని ఆదేశించారు. ఆయన వెంట హెచ్‌వోడీ అమిత్‌రంజన్‌, సిబ్బంది ఉన్నారు.

Updated Date - 2021-10-22T05:00:39+05:30 IST