సదర్‌ సందడి

ABN , First Publish Date - 2021-11-06T05:21:20+05:30 IST

సదర్‌ సందడి

సదర్‌ సందడి
దున్నపోతుపై నృత్యం చేస్తున్న యాదవ సంఘం నాయకుడు

 ఘట్‌కేసర్‌ /మేడ్చల్‌: ఘట్‌కేసర్‌ మున్సిపాలిటీలో గురువారం సదర్‌ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. యాదవులు ప్రత్యేకంగా అలంకరించిన దున్నపోతులను ప్రదర్శించారు. వాటిపైకి ఎక్కి నృత్యం చేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ముల్లి పావనిజంగయ్యయాదవ్‌ మాట్లాడుతూ దీపావళి సందర్భంగా సదర్‌  ఉత్సవాలను నిర్వహించటం ఆనవాయితీగా  వస్తుందన్నారు. తెలంగాణలో ఏ పండుగైనా ప్రకృతితో ముడివేసి ఉంటుందన్నారు. జంతువులపై ప్రేమను ప్రదర్శించటంలో భాగంగానే సదర్‌ ఉత్సవాలను నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు బత్తుల నరేష్‌, కుతాడి రవీందర్‌, యాదవ సంఘం అధ్యక్షుడు , నాయకులు బర్ల రాధాకృష్ణ, దేవేందర్‌, అబ్బసాని అంజయ్య, సత్యనారాయణ, చిత్తారి, పొన్నయ్య, సురేష్‌, మనుక కుమార్‌ రాజబోయిన యాదగిరి, ఆనంద్‌, కృష్ణ, వీరేందదరర్‌, లక్ష్మణ్‌, రవి, గోదా సురేష్‌, పాల్గొన్నారు. సదర్‌ ఉత్సవాలు మేడ్చల్‌ మండలం పూడూరు గ్రామంలో  గురువారం రాత్రి ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా యాదవులు తమ వృత్తిలో భాగమైన దున్నపోతులను అందంగా ముస్తాబు చేసి సాహస కార్యక్రమాలు నిర్వహించారు. సదర్‌ఉత్సవాలను తిలకించేందుకు పెద్ద ఎత్తున  ప్రజలు తరలివచ్చారు.  కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ పార్టీ మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గ ఇన్‌చార్జి మర్రి రాజశేఖర్‌రెడ్డి, సర్పంచ్‌ బాబూయాదవ్‌, భాస్కర్‌యాదవ్‌, జగన్‌రెడ్డి, దయానంద్‌యాదవ్‌, రమేష్‌, సందీప్‌గౌడ్‌, మధుకర్‌, హనుమంత్‌రెడ్డి, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-11-06T05:21:20+05:30 IST