మీసేవ కేంద్రాల వద్ద జనం బారులు

ABN , First Publish Date - 2021-02-06T05:04:37+05:30 IST

మీసేవ కేంద్రాల వద్ద జనం బారులు

మీసేవ కేంద్రాల వద్ద జనం బారులు
రేషన్‌కార్డు-ఫోన్‌ నెంబర్‌ లింక్‌ కోసం గుమిగూడిన జనం

షాద్‌నగర్‌అర్బన్‌: ఓటీపీ ద్వారా రేషన్‌ సరకులు ఇస్తామని ప్రభుత్వం నిర్ణయించడంతో ఆధార్‌కార్డుకు ఫోన్‌ నెంబర్‌ను అనుసంధానం చేయించుకోవడానికి మీసేవ కేంద్రాల వద్ద  రేషన్‌ కార్డుదారులు బారులు తీరారు.  చాలా మంది లబ్ధిదారుల  కనుపాపలను ఐరిస్‌ స్కానింగ్‌ చేయకపోవడం, ఆధార్‌కార్డులకు ఫోన్‌ నెంబర్లు అనుసంధానం లేకపోవడంతో రేషన్‌ సరకులను పొందలేకపోతున్నారు. దాంతో మీసేవ కేంద్రాల వద్దకు వినియోగదారులు పరుగులు పెడుతున్నారు. షాద్‌నగర్‌ పట్టణ వాసులే కాకుండా గ్రామీణులు సైతం రావడంతో మీసేవ కేంద్రాల వద్ద రద్దీ పెరిగింది. 

Updated Date - 2021-02-06T05:04:37+05:30 IST