నిబంధనలు పాటించాలి
ABN , First Publish Date - 2021-05-22T03:42:53+05:30 IST
నిబంధనలు పాటించాలి

- తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి
- దాతల సాయం
- మాస్కులు, శానిటైజర్లు, గ్లౌజుల పంపిణీ
తాండూరు: వ్యాపారులు, ప్రజలు లాక్‌డౌన్ నిబంధనలు పాటించాలని ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి సూచించారు. కరోనా నేపథ్యంలో బసవన్న కట్ట నుంచి కూరగాయమారె ్కట్‌ను ప్రభుత్వ జూనియర్ కళాశాలకు తరలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మార్కెట్‌ను సందర్శించి వ్యాపారులతో మాట్లాడారు. ప్రజలు సామాజిక దూరం పాటించాలని, మాస్కులు ధరించాలని సూచించారు. ఎమ్మెల్యేవెంట గ్రంథాలయ చైర్మన్ మురళికృష్ణ, మున్సిపల్ చైర్‌పర్సన్ స్వప్న, వైస్‌చైర్‌పర్సన్ దీపా, వెంకట్‌రెడ్డి, శ్రీనివాసాచారి, నర్సిరెడ్డి, రాజన్‌గౌడ్, సంతో్‌షగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
నేటి నుంచి రైతుబజార్‌లోనే విక్రయాలు
రైతుబజార్‌లోనే శనివారం నుంచి కూరగాయలనువిక్రయించుకోవాలి ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి పేర్కొన్నారు. కూరగాయల మార్కెట్‌ను రోహిత్‌రెడ్డి సందర్శించగా, తమ ప్రదేశంలోనే కూరగాయలు విక్రయించుకుంటామని నిరసిస్తూ ఉచితంగా కూరగాయలు అందజేసి నిరసన తెలిపారు. ఈ విషయమై ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి క్యాంపు కార్యాలయంలో చర్చించారు. అనంతరం మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్‌నాయక్ మాట్లాడుతూ ఎమ్మెల్యే ఆదేశానుసారంగా జూనియర్ కళాశాల మైదానంలో కనీస సౌకర్యాలు లేవని రైతుబజార్‌లో వసతి, వ్యాపారులకు షెడ్లు సిద్ధంగా ఉన్నాయన్నారు.కాగా జూనియర్ కళాశాలకు మారిన కూరగాయల మార్కెట్‌లో వ్యాపారం చేసుకోరాదంటూ రైతులను దళారులు అందోళనకు గురి చేస్తున్న విషయమై బీజేపీ నాయకులు రైతులతో మాట్లాడారు. అనంతరం సీఐతో మాట్లాడి రైతులు అక్కడే వ్యాపారం చేసుకోవాలని భరోసా కల్పించారు. కార్యక్రమంలో అంతారం లలిత, యు.రమే్‌షకుమార్, కార్యదర్శి బంటారం భద్రేశ్వర్, రజినికాంత్, సుదర్శన్‌గౌడ్ పాల్గొన్నారు.
ఆక్సిజన్ కాన్సట్రేటర్ల అందజేత
తాండూరులోని మాతా శిశు ఆస్పత్రిలో కొనసాగుతున్న ఐసోలేషన్ కేంద్రానికి 9 ఆక్సిజన్ కాన్సట్రేటర్లు అందజేశారు. గ్రీన్కో, ఏఎంఆర్ కంపెనీ సహాయంతో తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి శుక్రవారం వాటిని అందజేశారు. ఈసందర్భంగా రోహిత్‌రెడ్డి మాట్లాడుతూ కొవిడ్ బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వాటిని అందజేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ మురళికృష్ణ, మున్సిపల్ చైర్‌పర్సన్ స్వప్న, వైస్ చైర్‌పర్సన్ దీపా, ఎంపీపీ బాలేశ్వర్‌గుప్తా, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వెంకట్‌రెడ్డి, నాయకులుశ్రీనివాసాచారి, నర్సిరెడ్డి, సంతో్‌షగౌడ్, రాజన్‌గౌడ్ పాల్గొన్నారు.
రూ. పదివేలు సాయం
కరోనాతో బాధపడుతూ ఆక్సిజన్ అందక ఇబ్బంది పడుతున్న తాండూరు ముస్లిం వెల్ఫేర్ సభ్యుడు రిషికపూర్‌ఖాన్‌కు రాజన్న మిత్రమండలి ద్వారా ఆక్సిజన్ ఫిల్ కోసం శుక్రవారం రూ.10వేలు అందజేశారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ రాజుగౌడ్, కో-ఆప్షన్ సభ్యులు అబ్దుల్ ఖవి, మిత్రమండలి సభ్యులు రాజశేఖర్, మాజీ కౌన్సిలర్ సుమిత్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
సేవా సమితులకు ఆర్థిక సహాయం
తాండూరు : జైవాసవి శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతిని పురస్కరించుకుని శుక్రవారం తాండూరులో ఆర్యవైశ్యయువజన సంఘం తరపున పేద ఆర్యవైశ్యులకు కిట్లు అందజేశారు. కరోనా సమయంలో మరణించిన వారికి అంత్యక్రియలు నిర్వహిస్తున్న ముస్లిం వెల్ఫేర్, మహాసేవా సమితి వారికి రూ.10వేల ఆర్థిక సహాయం అందజేశారు. అదేవిధంగా కరోనా పేషంట్లకు అన్నదానం చేస్తున్న హెల్పింగ్ హ్యాండ్స్ వారికి రెండు క్వింటాళ్ల బియ్యం అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ స్వప్న, ఎంపీపీ బాలేశ్వర్‌గుప్తా, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు రాజలింగం, కార్యదర్శి మురళి, కోశాధికారి ఆదిత్య గుప్తా, చందు, శ్రీధర్, శేషాద్రి, వినోద్ తదితరులు పాల్గొన్నారు.
ప్రైవేటు ఆస్పత్రుల దోపిడీ అరికట్టాలి
ప్రైవేటు ఆస్పత్రుల దోపిడీ అరికట్టాలని తెలంగాణ జనసమితి తాండూరు మున్సిపల్ ఫ్లోర్ లీడర్ సోంశేఖర్ ఒక ప్రకటనలో ఆరోపించారు. కరోనా బాధితులు ప్రైవేటు ఆస్పత్రికి వెళితే నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు ఆస్పత్రులయాజమాన్యాలు చార్జీలు వసూలు చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వం పేద ప్రజలను దృష్టిలో ఉంచుకుని ప్రైవేటు ఆస్పత్రులన్నింటినీ తమ ఆధీనంలోకి తీసుకుని కరోనా చికిత్సలు అందించాలని, ఐసోలేషన్ కేంద్రంలో సౌకర్యాలు పెంచి వైద్యం అందేలా చూడాలని ఆయన ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.
ఆర్‌వీకే ఐసోలేషన్ సెంటర్‌లో 20మంది డిశ్చార్జ్
ఘట్‌కేసర్: పోచారం మున్సిపాలిటీ పరిధిలోని అన్నోజిగూడ రాష్ట్రీయ విద్యావిహార్ పాఠశాలలో ఏర్పాటు చేసిన కరోనా ఐసోలేషన్ సెంటర్‌లో శుక్రవారం 20మంది కోలుకొని ఇళ్లకు వెళ్లారు. ఈ ఐసోలేషన్ సెంటర్‌లో 260బెడ్లను అందుబాటులో ఉంచినట్లు నిర్వహకులు తెలిపారు. కరోనా నుంచి కోలుకొని ఇళ్లకు వెళ్తున్న వారికి మున్సిపల్ చైర్మన్ బోయపల్లి కొండల్‌రెడ్డి వీడ్కోలు పలికారు. ఈసందర్భంగా ఆర్‌వీకే, సేవాభారతి, మున్సిపల్ కమిషనర్, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.
మాస్కులు, శానిటైజర్లు, గ్లౌజులు పంపిణీ
ఘట్‌కేసర్: కరోనా మహమ్మరి నుంచి రక్షించుకోవడానికి మాస్కులు, శానిటైజర్లు, గ్లౌజులు ఎంతో ముఖ్యమని గ్రేట్ కలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ డైరక్టర్ పి.శ్రీనివా్‌సరెడ్డి అన్నారు. శుక్రవారం ఘట్‌కేసర్‌లోని వివిధ పెట్రోల్ బంకుల్లో, పోలీస్ చెక్‌పోస్టుల వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసులకు మాస్కులు, శానిటైజర్లు, గ్లౌజులు పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ తగు జాగ్రత్తలు పాటిస్తూ ముందుకుసాగితే కరోనా ఒకరి నుంచి మరొకరికి వ్యాపించకుండా ఉంటుందన్నారు. తమ సంస్థ ఆధ్వర్యంలో తాము నిరంతరం పేదలకు అవసరమైన సేవలు అందిస్తున్నామన్నారు.
మునిసిపల్ కార్మికుల ఐడీ కార్డులు
వికారాబాద్ : లాక్‌డౌన్‌లో ఇబ్బంది పడుతున్నందున పారిశుధ్య కార్మికులు ఐడీకార్డులు అందించడం జరిగిందని మునిసిపల్ చైర్ పర్సన్ మంజుల రమేష్ తెలిపారు. శుక్రవారం పారిశుద్ధ్య కార్మికులకు మునిసిపల్ ఐడీ కార్డులు అందజేశారు. కార్యక్రమంలో రమేష్, బుచ్చయ్య, ఎస్‌ఐ నాగరాజు, రాజు, శంకర్, చిన్నయ్య, ఆశయ్య పాల్గొన్నారు.