కమ్యూనిటీ హాల్‌ నిర్మాణానికి రూ.50లక్షలు

ABN , First Publish Date - 2021-11-06T05:18:21+05:30 IST

కమ్యూనిటీ హాల్‌ నిర్మాణానికి రూ.50లక్షలు

కమ్యూనిటీ హాల్‌ నిర్మాణానికి రూ.50లక్షలు
ఉత్తర్వు కాపీని అందజేస్తున్న మంత్రి మల్లారెడ్డి

మేడ్చల్‌ : గుండ్లపోచంపల్లి మున్సిపల్‌ కండ్లకోయలో ఎస్సీ కమ్యూనిటీ హాల్‌ నిర్మాణానికి రూ.50లక్షలు కేటాయించినట్లు మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం నిధుల మంజూరు కాపీని కండ్లకోయ మాజీ సర్పంచ్‌లు స్వామి, నరేందర్‌రెడ్డి, రవీందర్‌గౌడ్‌లకు అందజేశారు. కార్యక్రమంలో గుండ్లపోచంపల్లి మాజీ సర్పంచ్‌ మద్దుల శ్రీనివా్‌సరెడ్డి, కౌన్సిలర్లు అమరం జైపాల్‌రెడ్డి, హేమంత్‌రెడ్డి, నాయకులు రవీందర్‌గౌడ్‌, జనార్ధన్‌రెడ్డి, సత్తిరెడ్డి, రాజేందర్‌ముదిరాజ్‌, వెంకటేష్‌, సంజీవగౌడ్‌, శ్రీనివాస్‌,రణదీ్‌పరెడ్డి పాల్గొన్నారు. కాగా గౌడవెల్లి గ్రామానికి చెందిన యు.సత్యనారాయణ సీఎం రిలీప్‌ఫండ్‌ కోసం దరఖాస్తు చేసుకోగా మంజూరైన రూ.లక్ష చెక్కును మంత్రి లబ్ధిదారుడికి అందజేశారు. దయానంద్‌యాదవ్‌, మాజీ సర్పంచ్‌ జగన్‌రెడ్డి, రవీందర్‌గౌడ్‌, సంతో్‌షభాను పాల్గొన్నారు. మంత్రి మల్లారెడ్డిని మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ రమేష్‌, కౌన్సిలర్లు నరసింహస్వామియాదవ్‌, జంగా హరికృష్ణయాదవ్‌, తుడుం గణేష్‌, కౌడే మహేష్‌, నాయకులు భాస్కర్‌యాదవ్‌, మధుకర్‌యాదవ్‌, దయానంద్‌యాదవ్‌, రాజు కలిసి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. 

Updated Date - 2021-11-06T05:18:21+05:30 IST