ఆశ కార్యకర్త కుటుంబానికి రూ.15లక్షల ఎక్స్‌గ్రేషియా
ABN , First Publish Date - 2021-05-22T05:16:41+05:30 IST
ఆశ కార్యకర్త కుటుంబానికి రూ.15లక్షల ఎక్స్‌గ్రేషియా

ఆమనగల్లు : జీహెచ్‌ఏంసీ ఎన్నికల విధులకు వెళ్లి గుండెపోటుతో మృతిచెందిన ముర్తోజుపల్లికి చెందిన ఆశ కార్యకర్త సూదిని వినోద కుటుంబానికి ప్రభుత్వం రూ.15 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. కాగా ఇంతకుముందు గ్రామస్థులు, ఆమె కుటుంబసభ్యులు, ఆశ కార్యకర్తలు, వైద్యసిబ్బంది ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డిని కలిసి ఆమె కుటుంబాన్ని ఆదుకోవాలని కోరగా స్పందించిన ఎమ్మెల్సీ సీఎం కేసీఆర్‌ను కలిసి వినోద కుటుంబం పరిస్థితిని వివరించారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఎక్స్‌గ్రేషియా మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు నారాయణరెడ్డి పేర్కొన్నారు.