కస్టడీ నుంచి దారిదోపిడీ దొంగ పరారీ
ABN , First Publish Date - 2021-10-30T04:24:09+05:30 IST
కస్టడీ నుంచి దారిదోపిడీ దొంగ పరారీ
- ఉదయం పారిపోగా సాయంత్రానికి పట్టుబడిన నిందితుడు
శంకర్‌పల్లి : దారి దోపిడీలకు పాల్పడుతున్న ఆరుగురు నిందితులను పట్టుకుని రిమాండ్‌కు తరలించేలోగా వారిలో పరారు కాగా పోలీసులు నిందితుడిని తిరిగి పట్టుకున్న ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గత వారం రోజులుగా మోమిన్‌పేట్, వికారాబాద్, శంకర్‌పల్లి, పలు ప్రాంతాల్లో దారిదోపిడీలకు పాల్పడుతున్న ఆరుగురు నిందితులను శంషాబాద్ ఎస్వోటీ, శంకర్‌పల్లి పోలీసులు సంయుక్తంగా వెంటాడి నిందితులను గురువారం అరెస్టుచేశారు. కాగా, వారిని రిమాండ్‌కు తరలించేలోపే ప్రధాన నిందితుడు మహమ్మద్ హర్షద్ (22) ఉదయం శంక్‌పల్లి పోలీ్‌సస్టేషన్‌లో టాయిలెట్ వస్తుందని నమ్మించి పోలీసుల కళ్లుగప్పి పరారయ్యాడు. దీంతో చేవెళ్ల ఏసీపీ రవిందర్‌రెడ్డి, శంకర్‌పల్లి సీఐ మహే్‌షగౌడ్ ఆధ్వర్యంలో శంకర్‌పల్లి పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలు, స్థానిక యువకులతో కలిసి గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో నిందితుడు సాయంత్రం శంకర్‌పల్లి మున్సిపాలిటీ పరిధి ఫత్తేపూర్ గ్రామ పరిధిలోని వ్యవసాయ పొలాల్లో కనిపించడంతో కౌన్సిలర్ జొన్నడ రాములు పోలీ్‌సలకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు నిందితుడిని పట్టుకుని పోలీ్‌సస్టేషన్‌కు తరలించారు.