మొరాయించిన రైల్వే గేటు.. వాహనదారుల ఇక్కట్లు

ABN , First Publish Date - 2021-11-10T05:12:00+05:30 IST

మొరాయించిన రైల్వే గేటు.. వాహనదారుల ఇక్కట్లు

మొరాయించిన రైల్వే గేటు.. వాహనదారుల ఇక్కట్లు
గేటు కిందినుంచి వెళ్తున్న ద్విచక్ర వాహనదారులు

వికారాబాద్‌ రూరల్‌: జిల్లా కేంద్రంలోని రామయ్యగూడా రహదారిలో రైల్వేట్రాక్‌ వద్ద రైల్వేగేటు మొరాయించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వికారాబాద్‌-బీదర్‌ రోడ్డులో మంగళవారం సాయంత్రం 4 గంటల సమయంలో రైలు వెళ్లేందుకు రైల్వే లైన్‌మెన్‌ గేటువేసి రైలు వెళ్లిన తరువాత మళ్లీ తెరిచేందుకు ప్రయత్నించగా గేటులోని తీగలు బిగిసుకుపోవడంతో పూర్తిగా తెరుచుకోలేకపోయాయి. దీంతో భారీవాహనాలు అక్కడే నిలిచిపోగా, ద్విచక్రవాహనదారులు గేటు కింద నుంచి వెళ్లేందుకు ప్రయత్నాలు చేశారు. చాలా సేపటి తరువాత రైల్వే అధికారులు మరమ్మతు చేయించారు.

Updated Date - 2021-11-10T05:12:00+05:30 IST