గంజాయి రవాణా నిరోధంలో ఎస్‌ఐలకు రివార్డులు

ABN , First Publish Date - 2021-10-30T04:27:55+05:30 IST

గంజాయి రవాణా నిరోధంలో ఎస్‌ఐలకు రివార్డులు

గంజాయి రవాణా నిరోధంలో ఎస్‌ఐలకు రివార్డులు
రివార్డులు అందుకుంటున్న ఎస్‌ఐలు ధర్మేష్‌, హరిశంకర్‌గౌడ్‌

ఆమనగల్లు : గంజాయి రవాణ, విక్రయాల నిరోదాన్ని అడ్డుకున్న ఆమనగల్లు సర్కిల్‌ పోలీసులను సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర అభినందించారు. ఆమనగల్లు ఎస్‌ఐ ధర్మేష్‌, కడ్తాల ఎస్‌ఐ హరిశంకర్‌గౌడ్‌, ఆమనగల్లు పీసీ అశోక్‌రెడ్డిలను శుక్రవారం కమిషనర్‌ కార్యాలయంలో రివార్డులు అందజేశారు. ఆమనగల్లు మండలం మేడిగడ్డ తండాలో గురువారం 20 గంజాయి ప్యాకెట్లను విక్రయిస్తున్న యువకుడిని ఎస్‌ఐ ధర్మేష్‌, పీసీ అశోక్‌రెడ్డి పట్టుకొని అరెస్ట్‌ చేశారు. అదే విధంగా రెండు రోజుల కిత్రం కడ్తాల మండలం బాలాజీనగర్‌తండా వద్ద గంజాయి చేట్లను ఎస్‌ఐ హరిశంకర్‌గౌడ్‌ స్వాధీనం చేసుకొని వక్తిని అరెస్ట్‌ చేశారు. ఆయా కేసుల్లో ప్రతిభ కనబరిచినందుకు అభినందించారు. కార్యక్రమంలో ఆమనగల్లు సీఐ ఉపేందర్‌ ఉన్నారు.

Updated Date - 2021-10-30T04:27:55+05:30 IST