మైసిగండి ఆలయానికి రూ.36.21లక్షల ఆదాయం

ABN , First Publish Date - 2021-03-25T04:40:06+05:30 IST

మైసిగండి ఆలయానికి రూ.36.21లక్షల ఆదాయం

మైసిగండి ఆలయానికి రూ.36.21లక్షల ఆదాయం

కడ్తాల్‌: మైసిగండి మైసమ్మ దేవాలయంలో బుధవారం 2021-22 సంవత్సరానికి గాను  కొబ్బరికాయల విక్రయ, వాహన పూజ రుసుముల వసూళ్లు, తలనీలాల వేలం నిర్వహించారు. ఆలయ ఫౌండర్‌ట్రస్టీ రామావత్‌ సిరోలిపంతూ, ఈవోలు స్నేహలత, నరేందర్‌ల పర్యవేక్షణలో వేలం కొనసాగింది. కొబ్బరికాయల విక్రయాన్ని మైసిగండికి చెందిన రామావత్‌ లక్ష్మణ్‌ రూ.25లక్షల61వేల500లకు దక్కించుకున్నారు. వాహన పూజ రుసుము వసూళ్ల వేలానికి 7 మంది పోటీపడగా మైసిగండికి చెందిన కేతావత్‌ శివరామ్‌నాయక్‌ రూ.10లక్షల60వేలకు కైవసం చేసుకున్నారు. తలనీలాల వేలానికి ఎవరూ రాకపోవడంతో వాయిదా వేసినట్లు ఈవో స్నేహలత ప్రకటించారు. 

Updated Date - 2021-03-25T04:40:06+05:30 IST