కళాశాల భవనం కోసం మంత్రికి వినతి
ABN , First Publish Date - 2021-12-27T05:09:45+05:30 IST
కళాశాల భవనం కోసం మంత్రికి వినతి

ఆమనగల్లు: ఆమనగల్లులో జూనియర్ కళాశాల భవన భవనం, డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని జడ్పీటీసీ అనురాధ, టీఆర్‌ఎస్ ఆమనగల్లు మున్సిపాలిటీ అధ్యక్షుడు పత్యనాయక్ విద్యా శాఖ మంత్రి సబితారెడ్డిని కోరారు. ఆదివారం నగరంలోని మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు. మాడ్గుల రోడ్డులో కాలేజీ భవనానికి స్థలం ఉందని, నిధులు మంజూరు చేయాలని కోరారు. ప్రభుత్వ ఆస్పత్రిని వంద పడకల స్థాయికి పెంచాలని కోరినట్లు పత్యనాయక్ తెలిపారు. ఈ సమస్యలపై ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ ఇప్పటికే ముఖ్యమంత్రికి వివరించారని, నిధులు విడుదల చేస్తారని మంత్రి చెప్పారన్నారు.