అన్ని రంగాల్లో రాణిస్తేనే గుర్తింపు

ABN , First Publish Date - 2021-11-01T05:16:22+05:30 IST

అన్ని రంగాల్లో రాణిస్తేనే గుర్తింపు

అన్ని రంగాల్లో రాణిస్తేనే గుర్తింపు
మాట్లాడుతున్న అద్దంకి దయాకర్‌

  • మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు అద్దంకి దయాకర్‌

(ఆంధ్రజ్యోతి, మేడ్చల్‌ జిల్లా ప్రతినిధి): మాలలు అన్ని రంగాల్లో రాణిసేన్తే ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుందనిమాలమహానాడు జాతీయ అధ్యక్షుడు అద్దంకి దయాకర్‌ అన్నారు. తూంకుంటలో మొగుళ్ల వెంకటరెడ్డి ఫంక్షన్‌హాల్‌లో 16వ మాల మహానాడు సభజరిగింది. ఈ కార్యక్రమానికి అద్దంకి దయాకర్‌తో పాటు ఇతర నాయకులు హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. మాల కులస్తులు రాజకీయంగా, వ్యాపారపరంగా, ఉద్యోగ రంగాల్లో ముందున్నారని, మరింతగా ముందుకు వెళ్లాల్సిన అవసరముందన్నారు. దేశంలో కల వివక్షత పోవాలన్నారు. సమానత్వం రావాలంటే భూములన్నీ జాతీయకరణ చేయాల్సి ఉందన్నారు. మహిళలపై జరుగుతున్న దాడులను ప్రభుత్వాలు నివారించాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్‌ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. అదేవిధంగా ఎస్సీ కార్పోరేషన్‌ ద్వారా నేరుగా రుణాలను బ్యాంకులతో లింక్‌ పెట్టకుండా ఇవ్వాలని, ప్రభుత్వం ఇనామ్‌, అసైన్డ్‌, భూదాన్‌ భూములను తీసుకోవడం నిలిపి వేయాలని రాజకీయ, సామాజిక విశ్లేషకుడు మల్లేపల్లి లక్ష్మయ్య అన్నారు. సభ ప్రారంభానికి ముందు మాల కులస్తులందరూ కలిసి జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో  తెలంగాణ మాల మహానాడు అధ్యక్షుడు పిల్లి సుధాకర్‌, నేతకాని మహార్‌ జాతీయ అధ్యక్షుడు గోమాస శ్రీనివాస్‌, నాయకులు కరికే  శ్రీనివాస్‌, దార సత్యం, మన్నె బాబురావు, శివకుమార్‌, గోని సైదులు, శివకుమార్‌, సైదులు, చంద్రశేఖర్‌, మేడి అంజయ్య, రవికుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-11-01T05:16:22+05:30 IST