మద్యం దుకాణాలకు దరఖాస్తుల స్వీకరణ
ABN , First Publish Date - 2021-11-27T04:31:30+05:30 IST
మద్యం దుకాణాలకు దరఖాస్తుల స్వీకరణ

ఘట్‌కేసర్ రూరల్/కొడంగల్‌రూరల్ : వాయిదా పడిన అంకిరెడ్డిపల్లి మద్యం దుకాణానికి నేటి నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఎక్సైజ్ సీఐ మల్లయ్య శుక్రవారం ప్రకటనలో తెలిపారు. శనివారం నుంచి ఈ నెల 29 సాయంత్రం 4గంటల వరకు దరఖాస్తు చేసుకోవాలని, అదివారం సైతం దరఖాస్తులు తీసుకోకున్నట్లు తెలిపారు. ఈనెల 30న మేడ్చల్ జిల్లా కలెక్టరేట్‌లో డ్రా తీయనున్నట్లు తెలిపారు. అసక్తిగల వారు దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. కాగా కొడంగల్ ఎక్సైజ్‌శాఖ పరిధిలోని గెజిట్ షాప్ నెం. 52, 53, 54 (కొడంగల్ మున్సిపాలిటీ పరిధి), 55 (రావుల్‌పల్లి), 56(దౌల్తాబాద్) దుకాణాల కేటాయింపునకు ఈనెల 29 వరకు వికారాబాద్ జిల్లా ఎక్సైజ్ కార్యాలయంలో దరఖాస్తులను స్వీకరించనున్నట్లు ఎక్సైజ్ సీఐ సైదులు తెలిపారు. 30న ఉదయం 11 గంటలకు కలెక్టరేట్‌లో లక్కీడ్రా నిర్వహించి దుకాణాలను కేటాయించనున్నట్లు తెలిపారు.