వ్యాక్సిన్‌ నిరాకరిస్తే రేషన్‌కార్డు రద్దు చేయాలి: ఆర్డీవో

ABN , First Publish Date - 2021-10-29T05:02:49+05:30 IST

వ్యాక్సిన్‌ నిరాకరిస్తే రేషన్‌కార్డు రద్దు చేయాలి: ఆర్డీవో

వ్యాక్సిన్‌ నిరాకరిస్తే రేషన్‌కార్డు రద్దు చేయాలి: ఆర్డీవో

ధారూరు: కొవిడ్‌ వాక్సిన్‌ వేసుకోవటానికి నిరాకరిస్తున్న వారి రేషన్‌కార్డును రద్దు చేయాలని వికారాబాద్‌ ఆర్డీవో ఉపేందర్‌రెడ్డి డిప్యూటీ తహసీల్దార్‌ వెంకటయ్యను ఆదేశించారు. మండల పరిధిలోని ధారూరు, కేరెల్లి గ్రామాల్లో కొనసాగుతున్న కొవిడ్‌ వాక్సిన్‌ సర్వేను గురువారం ఆయన తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఈ పంచాయతీల పరిధిలో అంగన్‌వాడీ, ఆశావర్కర్లు నిర్వహిస్తున్న సర్వేలో వాక్సిన్‌ వేసుకున్న, వేసుకోని వారి వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. కొవిడ్‌ వాక్సిన్‌ వేసుకోని వారితో ఆయన మాట్లాడారు. వాక్సిన్‌ పై అనుమానాలు వద్దని, ఎలాంటి దుష్ప్రభావాలు కలుగవని అవగాహన కల్పించారు. ఆర్డీవో వెంట సర్పంచ్‌ చంద్రమౌళి, మండల మాజీ కోఆప్షన్‌ సభ్యుడు హఫీజ్‌  ఉన్నారు. 

Updated Date - 2021-10-29T05:02:49+05:30 IST