రంగారెడ్డిలో యువతిపై అత్యాచారయత్నం

ABN , First Publish Date - 2021-10-14T15:21:04+05:30 IST

రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హిమాయత్ సాగర్ లార్డ్స్ ఇంజనీరింగ్ కాలేజ్ సమీపంలో ఓ యువతిపై అత్యాచారయత్నం జరిగింది.

రంగారెడ్డిలో యువతిపై అత్యాచారయత్నం

రంగారెడ్డి: రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హిమాయత్ సాగర్ లార్డ్స్ ఇంజనీరింగ్ కాలేజ్ సమీపంలో  ఓ యువతిపై కొందరు వ్యక్తులు అత్యాచారయత్నానికి పాల్పడ్డారు. అత్తాపూర్ కల్లు కాంపౌండ్‌లో యువతికి కల్లు తాగిపించిన దుండగులు అక్కడి నుంచి ఆటోలో తీసుకెళ్లారు. తాను ప్రమాదంలో ఉన్నట్లు గుర్తించిన యువతి 100 డయల్‌కి కాల్ చేసింది. పోలీసులు రావడంతో దుండగులు పరారయ్యారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. 

Updated Date - 2021-10-14T15:21:04+05:30 IST