చాక్లెట్ ఇస్తానంటూ నమ్మించి...నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం

ABN , First Publish Date - 2021-10-21T15:10:26+05:30 IST

హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్‌లో దారుణం జరిగింది. అభం శుభం తెలియని నాలుగు సంవత్సరాల చిన్నారిపై కాంతు అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు.

చాక్లెట్ ఇస్తానంటూ నమ్మించి...నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం

రంగారెడ్డి:  హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్‌లో దారుణం జరిగింది. అభం శుభం తెలియని నాలుగు సంవత్సరాల చిన్నారిపై కాంతు అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. చాక్లెట్ ఇప్పిస్తానని నమ్మించి ఇంట్లోకి పిలిచిన కామాంధుడు చి‌న్నారిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. చిన్నారికి రక్తస్రావం కావడంతో గుర్తించిన తల్లి...కామాంధుడిని ప్రశ్నించింది. దీంతో ఎవరికైనా విషయం చెబితే చంపుతానంటూ నిందితుడు బెదిరింపులకు పాల్పడ్డాడు. హిమాయత్ సాగర్‌లో ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.  స్థానికుల సహాయంతో కుటుంబ సభ్యులు రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. కాగా గాంజా మత్తులో చిన్నారిపై లైంగిక దాడి జరిగినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

Updated Date - 2021-10-21T15:10:26+05:30 IST