బాస్కెట్‌బాల్‌లో రంగారెడ్డి అద్వితీయం

ABN , First Publish Date - 2021-11-21T05:41:49+05:30 IST

బాస్కెట్‌బాల్‌లో రంగారెడ్డి అద్వితీయం

బాస్కెట్‌బాల్‌లో రంగారెడ్డి అద్వితీయం

  • ద్వితీయ బహుమతి పొందిన రంగారెడ్డి బాలబాలికల జట్లు


అయిజ: జోగుళాంబ గద్వాల జిల్లా అయిజ మండలం ఉత్తనూరులో జరిగిన రాష్ట్ర స్థాయి బాస్కెట్‌బాల్‌ బాలురు, బాలికల విభాగాల్లో హైదరాబాద్‌ జట్లు విజయం సాధించాయి. రంగారెడ్డి జిల్లా బాలురు, బాలికల జట్లు ద్వితీయ స్థానాన్ని దక్కించుకున్నాయి. తెలంగాణ రాష్ట్ర 5వ అండర్‌-19 జూనియర్‌ బాస్కెట్‌ బాల్‌ పోటీలు 3 రోజులుగా సాగాయి. 18న ప్రారంభమై శనివారంతో ముగిశాయి. ఉమ్మడి పది జిల్లాల నుంచి బాలురు, బాలికల విభాగాల్లో 10 జట్ల చొప్పున పోటీల్లో పాల్గొన్నాయి. శనివారం రాత్రి ఫైనల్‌లో బాలికల విభాగంలో హైదరాబాద్‌, రంగారెడ్డి, బాలుర విభాగంలో హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల జట్లు తలపడ్డాయి. హైదరాబాద్‌ బాలికల జట్టు 41 స్కోర్‌తో ప్రథమ స్థానంలో నిలిచింది. 21 స్కోర్‌తో రంగారెడ్డి ద్వితీయ స్థానంలో నిలిచింది. బాలుర విభాగంలో హైదరాబాద్‌ జట్టు 36 స్కోర్‌తో ప్రథమ స్థానం, 21 స్కోర్‌తో రంగారెడ్డి ద్వితీయ స్థానంలో నిలిచాయి. అనంతరం బహుమతులు ప్రదానం చేశారు. ఉత్తనూర్‌లో ధన్వంతరి వేంకటేశ్వరస్వామి ఆలయ కమిటీ, రాష్ట్ర బాస్కెట్‌బాల్‌ అసోసియేషన్‌ అధ్వర్యంలో మాజీ ఎంపీపీ తిరుమల్‌రెడ్డి పోటీలను నిర్వహించారు. 

Updated Date - 2021-11-21T05:41:49+05:30 IST