రంగారెడ్డిలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

ABN , First Publish Date - 2021-08-27T16:10:40+05:30 IST

జిల్లాలోని శంషాబాద్ మండలం సుల్తాన్ పల్లి గ్రామ శివారులో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది.

రంగారెడ్డిలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

రంగారెడ్డి: జిల్లాలోని శంషాబాద్ మండలం సుల్తాన్ పల్లి గ్రామ శివారులో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న శంషాబాద్ పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా మార్చరీకి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతి చెందిన వ్యక్తి ఎవరు అనే విషయం తెలియాల్సి ఉంది. మృతదేహం వద్ద బ్యాగ్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతదేహం పూర్తిగా కుల్లిపోయి ఉండడంతో పది రోజుల క్రితం మృతి చెందినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2021-08-27T16:10:40+05:30 IST