రైతుబంధును పెండింగ్‌లో పెట్టొద్దు

ABN , First Publish Date - 2021-07-13T05:13:27+05:30 IST

రైతుబంధును పెండింగ్‌లో పెట్టొద్దు

రైతుబంధును పెండింగ్‌లో పెట్టొద్దు
సమావేశంలో మాట్లాడుతున్న జడ్పీ వైస్‌చైర్మన్‌ గణేష్‌

(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌): ప్ర భుత్వం రైతులకు అందజేస్తున్న రైతుబంధు డబ్బు రానివారికి ఇంకా పెండింగ్‌లో పెట్టకుం డా వెంటనే రైతుల ఖాతాల్లో జమచేయాలని జడ్పీ వైస్‌చైర్మన్‌ ఈట గణేష్‌ అన్నారు. సోమవారం జిల్లా పరిషత్‌తో స్థాయీ సంఘాల స మావేశాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడు తూ.. భూసారాన్ని తెలుసుకునేందుకు మట్టి పరీక్షలు చేయాలని తెలిపారు. రైతుల పంటల ను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని అధికారులకు సూచించారు. నేషనల్‌ అగ్నికల్చర్‌ మార్కెటింగ్‌ పథకం షాద్‌నగర్‌, శంకర్‌పల్లి మార్కెట్‌ పరిధిలో అమలవుతున్నట్టు మార్కెటింగ్‌ అధికా రి ఛాయాదేవి తెలిపారు. గొర్రెలు, మేకలు, పశువులకు ఎప్పటికప్పుడు తరచూ వ్యాధి నిరదోధక టీకాలు వేయాలని పశుసంవర్ధకశాఖ అధికా రికి సూచించారు. రైతులకు డ్రిప్‌ పరికరాలు మంజూరు చేయాలని సూచించారు. బిక్షాటన చేస్తున్న పిల్లలను గుర్తించి వారిని చైల్డ్‌హోం కు తరలించాలని జడ్పీ సీఈవో దిలీ్‌పకుమార్‌ సూచించారు. వృద్ధాశ్రమాలను తనిఖీ చేయా లన్నారు. సమావేశంలో జడ్పీటీసీలు విశాల, ని త్య, జంగారెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, అనురాధ, వ్యవసాయధికారి గీతారెడ్డి, వివిధ శాఖల అధికారు లు సునంద, సుకీర్తి, రామేశ్వరి పాల్గొన్నారు. 

Updated Date - 2021-07-13T05:13:27+05:30 IST