మెరుగైన వైద్యసేవలు అందించాలి
ABN , First Publish Date - 2021-05-21T04:23:56+05:30 IST
మెరుగైన వైద్యసేవలు అందించాలి

- డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ దామోదర్
కొందుర్గు : ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ దామోదర్ అన్నారు. గురువారం శ్రీరంగాపూర్, ఉమ్మెంత్యాల సబ్ సెంటర్లను తనిఖీ చేశారు. ఆయా గ్రామాల్లో నిర్వహిస్తున్న ఫీవర్ సర్వేను పరిశీలించారు. అనంతరం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సిబ్బందితో సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో హెల్త్ ఎడ్యుకేటర్ జె. శ్రీనివాసులు, యంపీహెచ్‌ఈవో ప్రభులింగం, సూపర్‌వైజర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.