నిరసన జ్వాల

ABN , First Publish Date - 2021-02-07T05:26:20+05:30 IST

కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన నూతన సాగుచట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌

నిరసన జ్వాల
ధర్నా చేస్తున్న రంగారెడ్డి డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి

  • కేంద్ర వ్యవసాయ చట్టాల రద్దుకు జాతీయ రహదారులు దిగ్బంధనం
  • ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్‌, వామపక్ష నాయకుల రాస్తారోకోలు, ధర్నాలు


కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన నూతన సాగుచట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఢిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా శనివారం ఉమ్మడి రంగారెడ్డిజిల్లాలో నిరసన జ్వాలలు వెల్లువెత్తాయి. కాంగ్రెస్‌, వామపక్షాల ఆధ్వర్యంలో ధర్నాలు, రాస్తారోకోలు చేశారు. రహదారులను దిగ్బంధం చేశారు. కొత్తగా తీసుకొచ్చిన రైతు చట్టాలను మోదీ ప్రభుత్వం వెంటనే రద్దుచేయాలని నినాదాలు చేశారు.


(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌) : కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉమ్మడి రంగారెడ్డిజిల్లాలో కాంగ్రెస్‌, వామపక్షాల నాయకులు ధర్నా, రాస్తారోకో చేశారు. జాతీయ రహదారులను దిగ్బంధనం చేశారు. రైతు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. 


రంగారెడ్డి జిల్లాలో..

రైతులకు మద్దతుగా కాంగ్రెస్‌ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మీర్‌పేట్‌ కార్పొరేషన్‌ పరిధిలోని మందమల్లమ్మ చౌరస్తాలోని హైవేపై ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయచట్టాలను రద్దుచేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ ధర్నాలో మాజీ జడ్పీ ఫ్లోర్‌ లీడర్‌ ఏనుగు జంగారెడ్డి, పీసీసీ కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డి, మతీన్‌, గోపాల్‌రెడ్డి, శ్రీపాల్‌రెడ్డి, హన్మంత్‌ రెడ్డి వెంకట్‌రెడ్డి, బాబు, జంగయ్య, యాదిరెడ్డి, మనోహర్‌ బాలునాయక్‌, శివప్రసాద్‌ పాల్గొన్నారు. 


చేవెళ్లలో..

చేవెళ్లలోని బీజాపూర్‌ జాతీయరహదారిపై ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ ధర్నాలో కాంగ్రెస్‌ పార్టీ చేవెళ్ల నియోజకవర్గ సీనియర్‌ నాయకులు సున్నపు వసంతం మాట్లాడారు. రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేసేంత వరకు ఉద్యమం ఆగదని హెచ్చరించారు. ఈ నిరసనలో పీసీసీ ఉపాధ్యక్షుడు మల్గారి జనార్దన్‌రెడ్డి, పీసీసీ సంయుక్తకార్యదర్శి శ్రీనివాస్‌గౌడ్‌, పార్టీ మండల అధ్యక్షుడు వీరేందర్‌రెడ్డి, ముడిమ్యాల్‌ పీఏసీఎస్‌ చైర్మన్‌ గోనె ప్రతాప్‌రెడ్డి, ఎంపీటీసీ రాములు, రమేశ్‌గౌడ్‌, నర్సింహులు, బాలయ్య, కృష్ణగౌడ్‌, మహేశ్వర్‌రెడ్డి, మద్దెల శ్రీనివాస్‌ పాల్గొన్నారు. 


మంత్రి కాన్వాయ్‌ని మళ్లించిన పోలీసులు

సాగర్‌-హైదరాబాద్‌ ప్రధాన రహదారిపై కాంగ్రెస్‌ నాయకులు ధర్నా నిర్వహిస్తుండగా హైదరాబాద్‌ నుంచి నాగార్జునసాగర్‌కు రాష్ట్ర మంత్రి జగదీష్‌రెడ్డి వెళ్తున్నారు. దాంతో మంత్రి కాన్వాయ్‌ రహదారిపై ఆగే ప్రమాదముందని సీఐ లింగయ్య, ఎస్సై ప్రభాకర్‌ గమనించారు. దాంతో మంత్రి కాన్వాయ్‌ని ప్రభుత్వ ఆసుపత్రి నుంచి శ్రీఆంజనేయస్వామి ఆలయం పక్క నుంచి పోలీస్‌స్టేషన్‌ వరకు దారి మళ్లించి మంత్రిని సాగర్‌ పంపించారు. ఈ విషయం మంత్రికి తెలియకుండా పోలీసులు పక్కాగా చర్యలు తీసుకున్నారు. 


కడ్తాలలో..  

కడ్తాల మండలకేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో పెద్దఎత్తున నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధికార ప్రతినిధి గూడూరు శ్రీనివాస్‌రెడ్డి, ఆమనగల్లు బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు నేనావత్‌ బీక్యానాయక్‌, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు యాట నర్సింహ, కాంగ్రెస్‌ జిల్లా నాయకుడు చేగూరి వెంకటేశ్‌, రేవంత్‌ మిత్ర మండలి రాష్ట్ర అధ్యక్షుడు ఆసీఫ్‌, మండల పరిషత్‌ కో-ఆప్షన్‌ సభ్యుడు జహంగీర్‌బాబా, కాంగ్రెస్‌ మండల వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బీచ్యానాయక్‌, మాలే మల్లేశ్‌గౌడ్‌, యాదయ్యగౌడ్‌, పూల శంకర్‌, రామ్‌చందర్‌నాయక్‌, మంకి శ్రీను, సత్యం, క్యామ రాజేశ్‌, భాను, రాములు, ఇమ్రాన్‌, మహేశ్‌, బాల్‌రాజ్‌, దేవేందర్‌గౌడ్‌ పాల్గొన్నారు.


షాద్‌నగర్‌లో..

కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన నూతన సాగుచట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఢిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా శనివారం షాద్‌నగర్‌ పట్టణ సమీపంలోని కేశంపేటరోడ్డు చౌరస్తాలో గల జాతీయ రహదారిని కాంగ్రెస్‌, వామపక్షాల నాయకులు స్తంభింపజేశారు. రోడ్డుపై బైఠాయించడంతో వాహనాలు నిలిచిపోయాయి. కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు వీర్లపల్లి శంకర్‌ మాట్లాడుతూ.. అధికార టీఆర్‌ఎస్‌ నాయకులు రైతులపై కపట ప్రేమను చూపుతున్నారని అన్నారు. నిరసన కార్యక్రమంలో సీపీఎం నాయకుడు ఎన్‌. రాజు, సీపీఐ నాయకులు టంగుటూరి నర్సింహా రెడ్డి, పానుగంటి పర్వతాలు, కార్మిక సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్‌ పినపాక ప్రభాకర్‌రావు, బాబర్‌ఖాన్‌, పి. జగదీశ్వర్‌, జి. బాల్‌రాజ్‌గౌడ్‌, గడ్డం శ్రీనివాస్‌యాదవ్‌, జంగా నర్సింహా యాదవ్‌, సుదర్శన్‌గౌడ్‌, శ్రీశైలం, కొమ్ము కృష్ణ, కొంకళ్ళ చెన్నయ్య, ఆశన్నగౌడ్‌, చలివేంద్రంపల్లి రాజు, సుధీర్‌, ముబారక్‌, మధు, చల్లా శ్రీకాంత్‌రెడ్డి, నలమోని శ్రీధర్‌, అశోక్‌, ఈశ్వర్‌నాయక్‌, బి. జంగయ్య, శ్రీను నాయక్‌, శ్రీవైలం, రామస్వామి, గోవింద్‌నాయక్‌, పవన్‌చౌహన్‌, ప్రశాంత్‌ పాల్గొన్నారు. 


ఇబ్రహీంపట్నంలో..

కేంద్ర పభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని జిల్లా రైతు సంఘం కార్యదర్శి బి.మధుసూదన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. శనివారం సీపీఎం, రైతు సంఘం ఆధ్వర్యంలో నాగార్జునసాగర్‌ ప్రధానరహదారి ఇబ్రహీంపట్నం బస్టాండు వద్ద రాస్తారోకో నిర్వహించారు. కార్యక్రమంలో సీపీఎం కోర్‌ కమిటీ సభ్యులు యాదయ్య, సామేల్‌, సీపీఎం మండల కార్యదర్శులు జంగయ్య, బ్రహ్మయ్య, రైతు సంఘం నాయకులు వెంకటేష్‌, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు అంజయ్య, సీఐటీయూ మండల కన్వీనర్‌ బుగ్గరాములు, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి శంకర్‌, డివిజన్‌ కార్యదర్శి జగన్‌, ప్రకాశ్‌కారత్‌ పాల్గొన్నారు.

యాచారం అంబేద్కర్‌ చౌరస్తాలో నిర్వహించిన ధర్నాలో కిసాన్‌సెల్‌చైర్మన్‌ ఎం.కోదం డరెడ్డి పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాన్ని రద్దు చేసేవరకు శాంతి యుతంగా ఉద్యమిస్తామన్నారు. ఈ ధర్నాలో కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు మస్కు నర్సింహ, మండల పరిషత్‌ ఉపాధ్యక్షుడు కె.శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు వి.తిరుమలేష్‌, ఎండీ ఇబ్రహీం, అంబోజు జగదీష్‌యాదవ్‌, కొన్నింటి ఈశ్వర్‌, కె.రామకృష్ణయాదవ్‌, కె.కిష్టయ్య, ఎస్‌.కిషన్‌, రాజేందర్‌ నాయక్‌, ఉప్పలభాస్కర్‌, మల్లేష్‌, ప్రశాంత్‌, కె.జంగయ్య, కె.యాదగిరి తదితరులున్నారు. 


వికారాబాద్‌లో..

వికారాబాద్‌ పట్టణంలోని ఎన్టీఆర్‌ చౌరాస్తాలో సీపీఎం, సీపీఐ, ఎంఎల్‌, న్యూడెమోక్రసీ సంఘాల నాయకులు రాస్తారోకో నిర్వహించారు. ఈ ధర్నాలో సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లేషం, నాయకులు మహిపాల్‌, మహేందర్‌, సుభాష్‌, సుదర్శన్‌, మల్లయ్య, బుగ్గయ్య, సతీష్‌, గీత, అనంతయ్య, ఆనందం, కృష్ణ, నరసింహులు, భీమయ్య, రాజు తదితరులు పాల్గొన్నారు. 


పరిగిలో.. 

పరిగిలోని మెయిన్‌ రోడ్డుపై రాస్తారోకోను నిర్వహించారు. గంటన్నరసేపు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ,  గత కాంగ్రెస్‌ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన ఎల్‌ఐపీ, బీడీఎల్‌, బిఎస్‌ఎన్‌ఎల్‌ లాంటి అనేక సంస్థలను బీజేపీ ప్రభుత్వం ప్రైవేట్‌కు ధారాదత్తం చేసేందుకు చర్యలు చేపట్టిందని విమర్శించారు ఈ ధర్నాలో డీసీసీ ప్రధానకార్యదర్శులు కె.హన్మంత్‌ముదిరాజ్‌, ఎం.లాల్‌కృష్ణప్రసాద్‌, సీపీఎం కార్యదర్శి ఎం.వెంకటయ్య, సీపీఐ కార్యదర్శి ఫీర్‌మహ్మద్‌, కిసాన్‌ సెల్‌ జిల్లా అధ్యక్షుడు సుభాష్‌రెడ్డి, పరిగి పట్టణ అధ్యక్షుడు ఇ.కృష్ణ, పరిగి,కులకచర్ల మండలాల పార్టీ అధ్యక్షులు పరుశురాంరెడ్డి, బీఎస్‌ ఆంజనేయులు, నాయకులు ఎన్‌.రామకృష్ణ, శివకుమార్‌, మల్లేష్‌, రియాజ్‌, సాహేద్‌, సర్వర్‌లు పాల్గొన్నారు. బొంరాస్‌పేటలో నిర్వహించిన ఆందోళనలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు బుస్సచంద్రయ్య, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు కొత్తూర్‌ చంద్రయ్య, ఎల్‌హెచ్‌పీఎస్‌ జిల్లా కార్యదర్శి సూర్యనాయక్‌ పాల్గొన్నారు. 


తాండూరులో..

కేంద్ర కార్పొరేట్‌ అనుకూల వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ తాండూరు పట్టణంలో సీపీఎం నాయకులు రాస్తారోకో నిర్వహించారు. ఈ ధర్నాలో సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కె.శ్రీనివాస్‌, యాలాల మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు భీమయ్య, బలహీన వర్గాల సంఘం రాష్ట్ర కార్యదర్శి అబ్బని బసయ్య, కేఎన్‌పీఎస్‌ రాష్ట్ర నాయకులు గుమ్మడి రత్నం పాల్గొన్నారు.Updated Date - 2021-02-07T05:26:20+05:30 IST