ఆక్రమణ నుంచి రోడ్డును కాపాడండి

ABN , First Publish Date - 2021-12-31T05:18:27+05:30 IST

ఆక్రమణ నుంచి రోడ్డును కాపాడండి

ఆక్రమణ నుంచి రోడ్డును కాపాడండి
పొలాలకు వెళ్లే రోడ్డు

కొత్తూర్‌: స్టేషన్‌ తిమ్మాపూర్‌ సమీపంలో ఓ పారిశ్రామికవేత్త రోడ్డును అక్రమించి ప్రహరీ నిర్మించేందుకు పునాది తవ్వాడని గ్రామస్తులు సంజీవరెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, విజయ్‌భాస్కర్‌రెడ్డి, నరోత్తంరెడ్డి తదితరులు గురువారం తహసీల్దార్‌ రాములుకు ఫిర్యాదు చేశారు. స్టేషన్‌ రోడ్డు నుంచి లోపల మట్టి రోడ్డు ఉందని, దీని చుట్టూ పొలాలు ఉన్నాయని, గుడి కూడా ఉందని తెలిపారు. దశాబ్దాలుగా రైతులు వాడుతున్న రోడ్డుకు పారిశ్రామికవేత్త ప్రహరీ కట్టిమూసేందుకు సిద్ధమయ్యాడని పేర్కొన్నారు. అధికారులు సర్వే చేయించి రోడ్డును కాపాడాలని  కోరారు. సర్వే చేయిస్తామని తహసీల్దార్‌ హామీ ఇచ్చారు.

Updated Date - 2021-12-31T05:18:27+05:30 IST