సమస్యలను వెంటనే పరిష్కరించాలి
ABN , First Publish Date - 2021-09-04T04:44:10+05:30 IST
సమస్యలను వెంటనే పరిష్కరించాలి

- ఎంపీపీ కోట్ల ప్రశాంతి, జడ్పీటీసీ పట్నం అవినా్‌షరెడ్డి
షాబాద్: గ్రామాల్లో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించి, ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని షాబాద్ ఎంపీపీ కోట్ల ప్రశాంతి, జడ్పీటీసీ పట్నం అవినా్‌షరెడ్డి అధికారులకు సూచించారు. శుక్రవారం షాబాద్ మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ అధ్యక్షతన నిర్వహించారు. కాగా, ఉదయం 11 గంటలకు సమావేశం ఉండగా అధికారులు, ప్రజాప్రతినిఽధులు సకాలంలో హాజరుకాకపోవడంతో గంట ఆలస్యంగా ప్రారంభించారు. అధికారులు అంశాలవారీగా ఎజెండాలో పొందుపర్చిన వివరాలను చదివారు. చర్చ లేకుండానే సమావేశాన్ని 12:30 గంటల వరకు సాగించి ముగించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ.. అధికారులు ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలను పరిష్కరించాలన్నారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున గ్రామాలు పరిశుభ్రంగా ఉండేలా ప్రజాప్రతినిధులు, అఽధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ స్వప్న, వైఎస్ ఎంపీపీ జడల లక్ష్మి, పీఏసీఎస్ చైర్మన్ చల్లా శేఖర్‌రెడ్డి, ఎంపీడీవో అనురాధ, అధికారులు, సభ్యులు పాల్గొన్నారు.