ప్రహరీ కూల్చివేత

ABN , First Publish Date - 2021-11-24T04:42:26+05:30 IST

ప్రహరీ కూల్చివేత

ప్రహరీ కూల్చివేత

కొందుర్గు: మండల కేంద్రంలో అనుమతి లేకుండా నిర్మిస్తున్న రాములుగౌడ్‌ ఇంటి ప్రహరీని మంగళవారం అధికారులు కూల్చివేయించారు. దీంతో గ్రామస్థులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. అనుమతిలేని నిర్మాణాలు గ్రామంలో ఇంకా ఉన్నాయని వాటిసంగతి ఏంటని ప్రశ్నించారు. ఎంపీవో లాలయ్య మాట్లాడుతూ అనుమతులు లేని నిర్మాణాలన్నింటిపై చర్యలు తీసుకుంటామన్నారు. వెంచర్‌ నిర్వాహకులు 10శాతం భూమి గ్రామపంచాయతీకి రిజిష్ట్రేషన్‌ చేసిన తర్వాత నిబంధనల ప్రకారం ఉన్నతాధికారుల నుంచి అనుమతులు తీసుకోవాలన్నారు. ఆ తర్వాతే ఇళ్లను నిర్మించుకోవాలన్నారు. సర్పంచ్‌ కావలి ఆదిలక్ష్మి, పంచాయతీ కార్యదర్శి అస్లాంపాషా పాల్గొన్నారు.

Updated Date - 2021-11-24T04:42:26+05:30 IST