శంషాబాద్ ఎయిర్పోర్టులో వ్యక్తి అరెస్ట్టు
ABN , First Publish Date - 2021-02-27T05:08:35+05:30 IST
శంషాబాద్ ఎయిర్పోర్టులో వ్యక్తి అరెస్ట్టు

శంషాబాద్రూరల్: ఓ వర్గాన్ని కించపరిచేలా సోషల్ మీడియాలో వీడియోలు పోస్టు చేసిన వ్యక్తిని శుక్రవారం శంషాబాద్ ఎయిర్పోర్టులో ఆరెస్ట్టు చేశారు. నగరంలోని చంద్రాయణ్గుట్టకు చెందిన మహ్మద్ అబు ఫైసల్ ఆలియాస్ మహ్మద్ లతీఫ్ కరోనా ప్రారంభదశలో సోషల్ మీడియాలో అసభ్యకర వీడియోలు పోస్టు చేశాడు. అప్పట్లో హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేశారు. లతీఫ్ గత కొన్ని నెలల నుంచి దుబాయ్లో తలదాచుకుంటున్నాడు. నిందితుడు దుబాయ్ నుంచి హైదరాబాద్ వస్తుండగా ఎయిర్పోర్టులో లుకౌట్ నోటీసుల ఆదేశాలు ఉండడంతో ఇమ్మిగ్రేషన్ అధికారులు సైబర్ క్రైం పోలీసులకు సమాచారం అందించారు. లతీఫ్ ఎయిర్పోర్టుకు చేరుకోగానే పోలీసులు అతన్ని ఆరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.