డ్రోన్లకు అనుమతి

ABN , First Publish Date - 2021-04-27T04:07:50+05:30 IST

వ్యవసాయ పరిశోధన యూనివర్సిటీ, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన

డ్రోన్లకు అనుమతి
తాండూరు పరిశోధన కేంద్రంలో డ్రోన్‌ ద్వారా పంటలపై మందుల పిచికారి ట్రయల్‌

  • పంటలపై మందుల పిచికారి చేసేందుకు కేంద్రప్రభుత్వం ఓకే..
  • మూడేళ్లపాటు ప్రయోగం కోసం పరిశోధన కేంద్రాలకు అధికారిక అనుమతులు
  • ఏడాదిగా పరిశోధనలు చేస్తున్న తాండూరు వ్యవసాయ పరిశోధన కేంద్రం
  • మారుతి డ్రోన్‌ కంపెనీతో యూనివర్సిటీ ఒప్పందం


తాండూరు: వ్యవసాయ పరిశోధన యూనివర్సిటీ, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రాల్లో డ్రోన్‌ సహాయంతో 5రకాల పంటలపై మందులు పిచికారి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం, డీజీసీఏ డైరెక్టర్‌ జనరల్‌ అధికారికంగా అనుమతులు ఇచ్చారు. మూడేళ్లపాటు డ్రోన్‌ ద్వారా మందులు ప్రయోగాత్మకంగా పిచికారి చేస్తూ సత్ఫలితాలుంటే రైతులకు సిఫార్సు చేయనున్నారు. ఇప్పటికే ఏడాదికాలంగా తాండూరు వ్యవసాయపరిశోధన కేంద్రంలో వివిధ పంటలపై పిచికారి చేస్తున్నారు. ఏడాదికాలంలో సత్ఫలితాలు ఇచ్చాయని మరో రెండేళ్లపాటు ట్రయల్‌ నిర్వహించి రైతులకు అందుబాటులోకి తెస్తామని తాండూరు వ్యవసాయపరిశోధన స్థానం హెడ్‌, సీనియర్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ సుధాకర్‌ తెలిపారు. పంటలపై ఎంత ఎత్తులో నుంచి మందులను పిచికారి చేయాలి. ఎంత మోతాదులో చేయాలి, పంటలపై విషప్రభావం ఏమైనా ఉంటుందా వంటి వాటిని శాస్త్రీయంగా పరిశీలిన్నారు. తాండూరు వ్యవసాయ పరిశోధన స్థానంతోపాటు ఎంపిక చేసిన రైతుల పొలంలో వీటిని ట్రయల్‌ నిర్వహిస్తున్నారు. డైరెక్టర్‌ జనరల్‌ సివిల్‌ హెవియేషన్‌ అనుమతులు ఇవ్వడంతో నాగర్‌కర్నూల్‌ జిల్లా పాలెంలో వేరుశనగ, వరంగల్‌లో పత్తి, వికారాబాద్‌ జిల్లా తాండూరులో కంది పంట వ్యవసాయ యూనివర్సిటీ రాజేంద్రనగర్‌లో డ్రోన్‌ ద్వారా పిచికారి చేస్తున్నారు. ఇప్పటికే వ్యవసాయ యూనివర్సిటీ మారుతి డ్రోన్‌ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. ఎకరాకు 15 నిమిషాల్లో 16 లీటర్ల మందు డ్రోన్‌ ద్వారా పిచికారి చేసే అవకాశం ఉంది. పవర్‌ స్ర్పే వల్ల ఎకరాకు 150 లీటర్ల మందు పిచికారి చేయవలసి వస్తుండగా డ్రోన్‌ వక్షౌ 16లీటర్లు మాత్రమే సరిపోతుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.



Updated Date - 2021-04-27T04:07:50+05:30 IST