ధ్యానం ద్వారా సహనసిద్ధి: సుభాష్‌పత్రీజీ

ABN , First Publish Date - 2021-12-30T05:12:05+05:30 IST

ధ్యానం ద్వారా సహనసిద్ధి: సుభాష్‌పత్రీజీ

ధ్యానం ద్వారా సహనసిద్ధి: సుభాష్‌పత్రీజీ

ఆమనగల్లు: అంతరించి పోతున్న మానవతా విలువల పెంపునకు ధ్యాన, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎంతగానో దోహదపడుతాయని ప్రపంచ ధ్యాన గురువు, పిరమిడ్‌ స్పిర్చ్యువల్‌ మూమెంట్‌ ఆఫ్‌ ఇండియా వ్యవస్థాపకుడు సుభా్‌షపత్రీజీ అన్నారు. మండల కేంద్రం సమీపంలోని కైలాసపురి మహేశ్వర మహాపిరమిడ్‌లో ధ్యాన మహోత్సవ వేడుకలు అట్టహాసంగా కొనసాగుతున్నాయి. మహిళా ధ్యానమహాచక్రం-3లో భాగంగా 9వ రోజు బుధవారం పత్రీజీ అఖండ వేణునాథ ధ్యానంతో సభలు ప్రారంభమయ్యాయి. మూడు గంటల పాటు పత్రీజీ వేణునాథ సంగీత ధ్యానంలో ధ్యానులు లీనులయ్యారు. ఈ సందర్భంగా పలు ధ్యాన, ఆధ్యాత్మిక పుస్తకాలను ఆవిష్కరించారు.  వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారుల ఆట పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో ఎమ్మెల్యే జైపాల్‌ యాదవ్‌,   జడ్పీవైస్‌ చైర్మన్‌ బాలాజీ సింగ్‌, గూడూరు లక్ష్మి నర్సింహారెడ్డి, విజయభాస్కర్‌రెడ్డి,  ప్రేమయ్య, మారం శివప్రసాద్‌, హనుమంత, రాంబాబు, సాంబశివరావు, లక్ష్మి, దామోదర్‌రెడ్డి, మాధవి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-30T05:12:05+05:30 IST