కరోనా నియంత్రణలో భాగస్వాములవ్వాలి

ABN , First Publish Date - 2021-07-13T05:06:39+05:30 IST

కరోనా నియంత్రణలో భాగస్వాములవ్వాలి

కరోనా నియంత్రణలో భాగస్వాములవ్వాలి
గిరిజన మహిళకు స్వీట్లు పంపిణీ చేస్తున్న గవర్నర్‌, పక్కన మంత్రి సబితారెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్‌ అనితారెడ్డి

  • కొవిడ్‌ టీకాపై అపోహలు వద్దు   
  • గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌


మహేశ్వరం: కరోనా టీకాపై అపోహలకు పోకుండా ధైౖర్యంగా టీకాలు తీసుకొని  కొవిడ్‌  నియంత్రణలో భాగస్వాములు కావాలని  గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ పిలుపు నిచ్చారు. సోమవారం మహేశ్వరం శ్రీ శివగంగ రాజరాజేశ్వరాలయంలో గవర్నర్‌ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కొత్వాల్‌చెర్వు తండా గ్రామ పంచాయతీలోని పల్లె ప్రకృతివనంలో విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్‌ తీగల అనితారెడ్డి, సర్పంచ్‌ మోతీలాల్‌, గిరిజన మహిళలతో కలిసి గవర్నర్‌ మొక్కలు నాటారు. తండాలో ఏర్పాటు చేసిన కొవిడ్‌ టీకా కేంద్రంలో వ్యాక్సినేషన్‌పై గిరిజనమహిళలకు అవగాహన కల్పించారు. అనంతరం కొవిడ్‌  టీకా సెకండ్‌ డోస్‌ తీసుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో తమిళిసై మాట్లాడారు.  కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా నియంత్రణకు ప్రత్యేక దృష్టి సారించినా, మారుమూల గ్రామాలు, గిరిజన తండాల్లోని ప్రజలు టీకాలు తీసుకోవడానికి ఆసక్తి చూపడం లేదన్నారు. కరోనా మహమ్మారిని అరికట్టాలంటే   టీకాలు వేసుకోవాలని సూచించారు.  గిరిజనలంటే తనకు చాలా అభిమానమన్నారు. అందుకే కేసీ తండాలో కొవిడ్‌ టీకా తీసుకున్నానన్నారు. ప్రతీ గిరిజన తండాలో ప్రజలందరు టీకా వేసుకోవాలన్నారు. భౌతికదూరం పాటిస్తూ మాస్కులు ధరిస్తూ కరోనాను కట్టడి చేయాన్నారు. కేసీ తండా పర్యటనలో భాగంగా 49 కుటుంబాలకు మిఠాయిలు పంచారు.

టీకాపై అపోహను తొలగించడానికి వచ్చిన గవర్నర్‌ : సబితాఇంద్రారెడ్డి

 గవర్నర్‌ మొదటిసారిగా మహేశ్వరం నియోజకవర్గంలోని గిరిజన తండాలో పర్యటించడం సంతోషంగా ఉందని,  ఇది రాష్ట్రంలోని గిరిజనులందరికీ గర్వకారణమని మంత్రి సబితారెడ్డి అన్నారు. గిరిజన మహిళలకు టీకాపై ఉన్న అపోహలను తొలగించి వారిలో చైతన్యం పెంచడాన్ని ప్రజలందరూ స్వాగతిసున్నారన్నారు. కరోనా నియంత్రణకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, ప్రజలందరూ సహకరించి టీకా తీసుకోవాలన్నారు. మాజీ ఎమ్మెల్యే తీగలకృష్ణారెడ్డి, రాచకొండ సీపీ మహే్‌షభగవత్‌, అదనప కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌, ఎంపీపీ రఘుమారెడ్డి, వైస్‌ఎంపీపీ ఆర్‌. సునీతఅంద్యానాయక్‌,  మహేశ్వరం సర్పంచ్‌ ప్రియాంకరాజేష్‌, ఎంపీటీసీ పోతర్ల సుదర్శన్‌యాదవ్‌, గవర్నర్‌ కార్యదర్శి సురేంద్రమోహన్‌, జిల్లా వైద్య అధికారి స్వరాజ్యలక్ష్మి,  డీఆర్‌డీఏ అడిషనల్‌ పీడీ నీరజ, ఆర్డీవో వెంకటాచారి, తహసీల్దార్‌ ఆర్‌పి. జ్యోతి, ఎండీవో నర్సింహులు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-07-13T05:06:39+05:30 IST