అదుపు తప్పిన కంటైనర్‌

ABN , First Publish Date - 2021-11-01T05:10:36+05:30 IST

అదుపు తప్పిన కంటైనర్‌

అదుపు తప్పిన కంటైనర్‌
డివైడర్‌ను ఢీకొట్టిన కంటైనర్‌

ఘట్‌కేసర్‌ రూరల్‌ : ఔటర్‌రింగు రోడ్డుపై ఆదివారం తెల్లవారుజామున కంటైనర్‌ అదుపు తప్పి రెండు బ్రిడ్జిల మధ్య చిక్కుకుంది. ఈ ఘటన ఘట్‌కేసర్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది.  ఢిల్లీ నుంచి  చెన్నై వెళు తున్న కంటైనర్‌ (హెచ్‌అర్‌ 55ఎజే 3400) ఆదివారం తెల్లవారుజామున ఘణాపూర్‌ వద్ద ఔటర్‌పై అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది.  రెండు బ్రిడ్జిల మధ్య అండర్‌పాస్‌ వద్ద చిక్కుకుంది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌ రుక్ముద్దీన్‌(36)కు గాయాలై క్యాబిన్‌లోనే ఇరుక్కుపోయాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని  ఎక్స్‌కవేటర్‌ సహాయంతో డ్రైవర్‌ను బయటకు తీసి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.  కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. 

Updated Date - 2021-11-01T05:10:36+05:30 IST