కొనసాగుతున్న కరోనా ఉధృతి

ABN , First Publish Date - 2021-03-25T04:40:42+05:30 IST

కొనసాగుతున్న కరోనా ఉధృతి

కొనసాగుతున్న కరోనా ఉధృతి

ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నం డివిజన్‌లో బుధవారం 11 సెంటర్లతోపాటు రెండు మొబైల్‌ టీంల ద్వారా 453 మందికి కరోనా యాంటీజెన్‌ పరీక్షలు నిర్వహించగా 24 మంది పాజిటివ్‌ వచ్చింది. అబ్దుల్లాపూర్‌మెట్‌ 8, యాచారం 5, ఎలిమినేడు 2, హయత్‌నగర్‌లో 9 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు వైద్యులు తెలిపారు. 


యాచారంలో ఐదుగురికి..

యాచారం : ప్రభుత్వాసుపత్రిలో నిర్వహించిన కరోనా పరీక్షల్లో ఐదుగురికి పాజిటివ్‌గా తేలింది. యాచారం టౌన్‌ లో  ఒక్కరు,  గడ్డమల్లాయాగూడలో  ఒక్కరు, నల్గొండ జిల్లా నాంపల్లి మండల కేంద్రానికి చెందిన ముగ్గురికి పాజిటివ్‌ వచ్చినట్లు వైద్యులు తెలిపారు.  


ఆమనగల్లులో ఒకరికి..

ఆమనగల్లు: ప్రభుత్వఆసుపత్రిలో ఆమనగల్లు, కడ్తాల్‌, తలకొండపల్లి మం డలాలకు చెందిన 14 మందికి పరీక్షలు నిర్వహించగా కడ్తాలకు చెందిన ఒకరికి పాజిటివ్‌ వచ్చినట్లు వైద్యులు తెలిపారు.


శంషాబాద్‌లో ఐదుగురికి..

శంషాబాద్‌ : శంషాబాద్‌ మున్సిపల్‌ కేంద్రంలో 64మందికి కొవిడ్‌ పరీక్షలు నిర్వహించగా ఐదుగురికి పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు డాక్టర్‌ నజ్మాభాను తెలిపారు. పాజిటివ్‌ వచ్చిన వారిని హోం క్వారంటైన్‌కు తరలించారు. 

Updated Date - 2021-03-25T04:40:42+05:30 IST