ఆర్టీసీ బస్సు ఢీకొని ఒకరికి తీవ్రగాయాలు

ABN , First Publish Date - 2021-12-08T04:58:32+05:30 IST

ఆర్టీసీ బస్సు ఢీకొని ఒకరికి తీవ్రగాయాలు

ఆర్టీసీ బస్సు ఢీకొని ఒకరికి తీవ్రగాయాలు
ప్రమాదంలో గాయపడిన చందర్‌

బషీరాబాద్‌: ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ వ్యక్తికి తీవ్ర గ్రాయాలైన ఘటన బషీరాబాద్‌ మండలం దామర్‌చెడ్‌ రోడ్డు మార్గంలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... నంద్యానాయక్‌తండా పంచాయతీకి చెందిన చందర్‌ ద్విచక్రవాహనంపై బషీరాబాద్‌ సంతకు కూరగాయలతో వెళ్తున్నాడు. ఈ క్రమంలో తాండూరు నుంచి కొత్లాపూర్‌ గ్రామానికి వస్తున్న ఆర్టీసీ బస్సు దామర్‌చెడ్‌ ప్రధాన మలుపు వద్ద ఎదురుగా ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. దీంతో చందర్‌ కిందపడగా కాలు పైభాగంలో విరిగి నుజ్జునుజ్జయింది. ఆ సమయంలో అటుగా వెళ్తున్న పూజారి శంకరప్ప, తండా సర్పంచ్‌ శంకర్‌ రాథోడ్‌లు అతడి కుటుంబసభ్యులకు సమాచారమిచ్చారు. వెంటనే బాధితుడిని ఆటోలో తాండూరు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. ఆర్టీసీ బస్సును పోలీ్‌సస్టేషన్‌కు తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Updated Date - 2021-12-08T04:58:32+05:30 IST