వందశాతం మొక్కలు పెంచాలి

ABN , First Publish Date - 2021-05-19T04:35:15+05:30 IST

వందశాతం మొక్కలు పెంచాలి

వందశాతం మొక్కలు  పెంచాలి
మొక్కలను పరిశీలిస్తున్న చైర్‌పర్సన్‌ మంజుల

వికారాబాద్‌ : నర్సరీల నిర్వహణపై వికారాబాద్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మంజులరమేష్‌ అసహనం వ్యక్తం చేశారు. నర్సరీలో పెంచుతున్న మొక్కలు వందశాతం బతికేలా చూడాలని నిర్వహకులకు సూచించారు. మంగళవారం వికారాబాద్‌ మున్సిపల్‌ పరిధిలోని కర్చర్ల గుట్ట, బృంగి, ఎన్నెపల్లి, అయ్యప్ప కాలనీ తదితర ప్రాంతాల్లోని వన నర్సరీలను చైర్‌పర్సన్‌ పరిశీలించారు. మొక్కల పెంపకంపై అధికారులకు కొత్త ప్రణాళికను ఇచ్చారు. చైర్‌పర్సన్‌ వెంట కమిషనర్‌ బుచ్చయ్య, మేనేజర్‌ శివా, ఎన్విరాన్‌మెంట్‌ ఇంజనీర్‌ శ్రీనివాస్‌,  శివ, మున్సిపల్‌ అధికారి రామకృష్ణ ఉన్నారు.

Updated Date - 2021-05-19T04:35:15+05:30 IST