రాజకీయాలకతీతంగా అభివృద్ధి

ABN , First Publish Date - 2021-11-06T04:58:40+05:30 IST

రాజకీయాలకతీతంగా అభివృద్ధి

రాజకీయాలకతీతంగా అభివృద్ధి

శంకర్‌పల్లి: రాజకీయాలకతీతంగా మున్సిపాలిటీని అభివృద్ధి చేసేందుకు కృషిచేస్తామని శంకర్‌పల్లి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సాత విజయలక్ష్మి అన్నారు. శుక్రవారం 3వ వార్డులో అండర్‌డ్రైనేజీ పనులను ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ.. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం అందరినీ కలుపుకొని మున్సిపాలిటీ అభివృద్ధికి కృషిచేస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వం నుంచి నిధులుతెచ్చి అభివృద్ధి చేస్తామన్నారు. వైస్‌చైర్మన్‌ వెంకట్‌రామ్‌రెడ్డి, కౌన్సిలర్లు రాధబాలకృష్ణ, శ్వేతాపాండురంగారెడ్డి, రంగారెడ్డి, కో-ఆప్షన్‌ సభ్యుడు వెంకట్‌రాంరెడ్డి, జొన్నడ శ్రీను, జగన్‌, మోహన్‌, బాలప్రసాద్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-11-06T04:58:40+05:30 IST