మినీవ్యాన్‌ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు

ABN , First Publish Date - 2021-02-27T05:07:37+05:30 IST

మినీవ్యాన్‌ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు

మినీవ్యాన్‌ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు

కొత్తూర్‌: ఆర్టీసీ బస్సు మినీ వ్యాన్‌ను ఢీకొనగా వ్యాన్‌లో ప్రయాణిస్తున్న తొమ్మిది మంది మహిళా కార్మికులకు గాయాలైన సంఘటన స్థానిక పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. కేశంపేట మండలం పాపిరెడ్డిగూడలో గల వెంకటేశ్వర్‌ హెచరీస్‌ పరిశ్రమలో చిక్‌గ్రేడింగ్‌ కార్మికులుగా పనిచేస్తున్న తొమ్మిది మంది మహిళలు వ్యాన్‌లో తిమ్మాపూర్‌లోని బ్రాంచ్‌కి  వెళుతున్నారు. తిమ్మాపూర్‌ చౌరస్తా వద్ద మలుపు తిరిగేందుకు డ్రైవర్‌ వాహనాన్ని నెమ్మది చేశాడు. ఈ క్రమంలో మహబూబ్‌నగర్‌ నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న ఆర్టీసీ బస్సు వ్యాన్‌ను వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో వాహనంలో ఉన్న లక్ష్మి, గంగా, నాగరాణి, పద్మ, పుష్పలత, ప్రభవతి, అరుణ, శోభ, కల్పన గాయపడ్డారు. క్షతగాత్రులను షాద్‌నగర్‌ ఆసుపత్రికి తరలించారు. అందులో నలుగురిని హైదరాబాద్‌ ఈఎ్‌సఐ ఆసుపత్రికి తరలించారు. పరిశ్రమ జీఎం అల్వాల్‌రెడ్డి కార్మికులను పరామర్శించారు. డ్రైవర్‌ నాగరాజు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ భూపాల్‌శ్రీధర్‌ తెలిపారు.  


Updated Date - 2021-02-27T05:07:37+05:30 IST