న్యూఇయర్ వేడుకలు ప్రశాంతంగా జరుపుకోవాలి : సీఐ
ABN , First Publish Date - 2021-12-31T05:20:27+05:30 IST
న్యూఇయర్ వేడుకలు ప్రశాంతంగా జరుపుకోవాలి : సీఐ

- డీజేలు పెట్టరాదు.. మద్యం తాగి వాహనాలు నడపవద్దు
తాండూరు రూరల్ : నూతన సంవత్సర వేడుకల్లో యాలాల, బషీరాబాద్, పెద్దేముల్, కరన్‌కోట్ పోలీసుస్టేషన్ల పరిధిలోని గ్రామాల్లో డీజేలు, అధిక శబ్ధాలతో సౌండ్ బాక్సులు పెట్టరాదని, మద్యం తాగి వాహనాలు నడపరాదని తాండూరు రూరల్ సీఐ జలందర్‌రెడ్డి గురువారం పేర్కొన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా ఎవరైనా మద్యంతాగి వాహనాలు నడిపితే కేసులు నమోదుచేసి జైలుకు పంపిస్తామన్నారు. పోలీసుస్టేషన్ల పరిధిలో వాహనాలు తనిఖీ చేస్తామని తెలిపారు. రాత్రి 12 తర్వాత ఎవరూ కూడా రోడ్లపై కనబడరాదని ఆదేశించారు.