నూతన ఆవిష్కరణలు చేపట్టాలి

ABN , First Publish Date - 2021-09-04T04:26:03+05:30 IST

నూతన ఆవిష్కరణలు చేపట్టాలి

నూతన ఆవిష్కరణలు చేపట్టాలి
వర్చువల్‌ సదస్సులో పాల్గొన్న ప్రతినిధులు

ఇబ్రహీంపట్నం: ప్రపంచం ఎదుర్కొంటున్న విపత్కర పరిస్థితుల్లో భాగంగా నాణ్యమైన పరిశోధనలు, నూతన ఆవిష్కరణలు చేపట్టాల్సిన అవసరముందని తైవాన్‌కు చెందిన నేషనల్‌ చుంగ్‌ చెంగ్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌, స్మార్ట్‌ లివింగ్‌ టెక్నాలజీ రీసెర్చ్‌ సెంటర్‌ డైరెక్టర్‌ డా.పావో-యాన్‌-సంగ్‌ అన్నారు. ఇబ్రహీంపట్నంలోని గురునానక్‌ విద్యాసంస్థలో కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌, ఐటీలో రెండ్రోజుల పాటు జరుగనున్న అంతర్జాతీయ సదస్సు శుక్రవారం వర్చువల్‌గా ప్రారంభమైంది. ఈ సందర్భంగా డా. పావో మాట్లాడుతూ.. శోధించడం ద్వారానే ఆవిష్కరణలు సాధ్యమవుతాయని,  శాస్త్రవేత్తలు, విద్యార్థులు చర్చించి తమ ఆలోచనలకు పదునుపెట్టాలని అన్నారు. సాంకేతిక విద్యలో ఎప్పటికప్పుడు వస్తున్న మార్పులను గమనించాలన్నారు. గురునానక్‌ విద్యాసంస్థల వైస్‌చైర్మన్‌ జి.ఎ్‌స.కోహ్లీ మాట్లాడుతూ.. ఇప్పటివరకు 8 అంతర్జాతీయ సదస్సులను విజయవంతంగా నిర్వహించామని, 9వ ఐసీఐసీఎ్‌సఈ-2021 సదస్సునుకూడా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామన్నారు. సదస్సుకు 1,200 పరిశోధనా పత్రాలు రాగా వాటిలో 400 వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులకు చెందినవని చెప్పారు. కార్యక్రమంలో యూనివర్సిటీ ఆఫ్‌ ఈస్టర్న్‌ ఫిన్లాండ్‌ ఫ్రొఫెసర్‌ డా.జియో-జీగానో, దక్షిణ కొరియా ఇంచియాన్‌ నేషనల్‌ యూనివర్సిటీకి చెందిన ఎంబెడెడ్‌ సిస్టమ్స్‌ ఇంజనీరింగ్‌ డిపార్ట్‌మెంట్‌కు చెందిన డా.గ్వాంజిల్‌ జియాన్‌, హెడ్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ అమెజాన్‌ యూయ్‌సఏకు చెందిన శరద్‌ బజాజ్‌, డీఆర్డీవో-న్యూ ఢిల్లీ సీనియర్‌ సైంటిస్ట్‌ డా. డి.ఝా, కంప్యూటర్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా లైఫ్‌టైం అచీవ్‌మెంట్‌ అవార్డు గ్రహీత డా. డి.డి.శర్మ, జెఎన్‌టీయూ రెక్టార్‌ డా. గోవర్ధన్‌, గురునానక్‌ విద్యాసంస్థల ఎండీ డా.హెచ్‌.ఎ్‌స.సైనీ, జీఎన్‌ఐటీసీ డైరెక్టర్‌ డా.ఎం.రామలింగారెడ్డి, జీఎన్‌ఐటీ ప్రిన్సిపాల్‌ ఎం.శ్రీనాథరెడ్డి, డా.సంజీవ్‌ శ్రీవాస్తవ, డా.రిషీసయాల్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-09-04T04:26:03+05:30 IST