ప్రపంచం మెచ్చిన నేత నరేంద్రమోదీ

ABN , First Publish Date - 2021-10-08T04:54:51+05:30 IST

గుజరాత్‌ ముఖ్యమంత్రిగా, దేశ ప్రధానిగా విజయవంతంగా

ప్రపంచం మెచ్చిన నేత నరేంద్రమోదీ
సమావేశంలో మాట్లాడుతున్న బొక్క నర్సింహారెడ్డి

  • బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి


షాద్‌నగర్‌అర్బన్‌: గుజరాత్‌ ముఖ్యమంత్రిగా, దేశ ప్రధానిగా విజయవంతంగా పాలన అందిస్తూ వస్తున్న నరేంద్రమోదీ ప్రపంచం మెచ్చిన నేతగా ఎదిగారని బీజేపీ జిల్లా అధ్య క్షుడు బొక్క నర్సింహారెడ్డి పేర్కొన్నారు. షాద్‌నగర్‌ పట్టణంలోని సాయిరాజా ఫంక్షన్‌హాలులో గురువారం సాయంత్రం నిర్వహించిన మేథావుల సదస్సుకు బొక్క నర్సింహారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ప్రజల శ్రేయస్సు కోసం సంక్షేమ ఫలాలను అందిస్తూనే... దేశ అభివృద్ధి, భద్రత కోసం పటిష్టమైన చర్యలు తీసుకుంటున్న మోదీ ప్రపంచ స్థాయిలో అగ్రనాయకుడని తెలిపారు. నిస్వార్థ సేవను అందిస్తూ ఆదర్శవంతుడిగా దేశానికి గొప్ప పేరు తెస్తున్న ప్రధానికి ప్రతీ భారతీయుడు అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సదస్సులో బీజేపీ నాయకులు డాక్టర్‌ ప్రేమ్‌రాజ్‌, ఎన్‌. శ్రీవర్ధన్‌రెడ్డి, జంగయ్యయాదవ్‌, అశోక్‌గౌడ్‌, సుదర్శన్‌గౌడ్‌, సి. మహేందర్‌రెడ్డి, డాక్టర్‌ టి.విజయ్‌కుమార్‌, ఏపీ మిథున్‌రెడ్డి, కె.వెంకటేష్‌గుప్త, పి.వెంకటేశ్వర్‌రెడ్డి, రుషీకేష్‌ పాల్గొన్నారు. 
Updated Date - 2021-10-08T04:54:51+05:30 IST