గ్రామాల అభివృద్ధికి పాటుపడాలి: ఎంపీపీ
ABN , First Publish Date - 2021-05-21T04:57:23+05:30 IST
గ్రామాల అభివృద్ధికి పాటుపడాలి: ఎంపీపీ

శామీర్‌పేట: గ్రామాల అభివృద్ధికి నిరంతరం పాటు పడాలని శామీర్‌పేట ఎంపీపీ ఎల్లూబాయి అన్నారు. గురువారం శామీర్‌పేట మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో వాణి ఆధ్వర్యంలో బీపీడీసీ యాక్షన్ ఫ్లాన్‌కు సంబంధించి ఎంపీపీ ఎల్లూబాయి ఎంపీటీసీలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ 2021-22 సంవత్సరానికి సంబంధించి యాక్షన్‌ప్లాన్ స్వీకరిస్తున్నందున గ్రామాల అభివృద్ధి పనులను పక్కాగా నమోదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ ఎల్లూసుజాత, ఎంఈవో సంతకుమారి, ఎంపీవో సునీత, మండల ఎఈ, ఎంపీటీసీలు పాల్గొన్నారు.