మునిసిపాలిటీలను ఆదర్శంగా తీర్చిదిద్దాలి

ABN , First Publish Date - 2021-12-31T04:04:29+05:30 IST

మునిసిపాలిటీలను ఆదర్శంగా తీర్చిదిద్దాలి

మునిసిపాలిటీలను ఆదర్శంగా తీర్చిదిద్దాలి
వీసీలో మాట్లాడుతున్న అదనపు కలెక్టర్‌ చంద్రయ్య

(ఆంధ్రజ్యోతి, వికారాబాద్‌జిల్లా ప్రతినిధి) : జిల్లాలోని నాలుగు మునిసిపాలిటీల్లోప్రజాప్రతినిధులు,అధికారుల సమన్వయంతో పనిచేస్తూ, ఆదర్శవంతమైన పట్టణాలుగా తీర్చిదిద్దేలా కృషి చేస్తున్నామని అదనపు కలెక్టర్‌ చంద్రయ్య అన్నారు. పట్టణ ప్రగతి, స్వచ్ఛసర్వేక్షణ్‌-2022పై గురువారం జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు, మునిసిపల్‌ చైర్మన్లు, కమిషనర్లతో ఐటీ మంత్రి కేటీఆర్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ చంద్రయ్య జిల్లాలోని వికారాబాద్‌, తాండూరు, పరిగి, కొడంగల్‌ మునిసిపాలిటీల్లో పట్టణ ప్రగతి కింద చేపట్టిన అభివృద్ధి, పారిశుధ్య కార్యక్రమాలు, వికారాబాద్‌, తాండూరు మునిసిపాలిటీలు స్వచ్ఛసర్వేక్షణ్‌లో సాధించిన ర్యాంకుల గురించి  మంత్రి కేటీఆర్‌కు వివరించారు. కార్యక్రమంలో మునిసిపాలిటీల చైర్మన్లు, కమిషనర్లు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-31T04:04:29+05:30 IST