గుట్టుచప్పుడు కాకుండా మున్సిపల్‌ సమావేశం!

ABN , First Publish Date - 2021-12-31T05:21:28+05:30 IST

గుట్టుచప్పుడు కాకుండా మున్సిపల్‌ సమావేశం!

గుట్టుచప్పుడు కాకుండా మున్సిపల్‌ సమావేశం!

వికారాబాద్‌ : మున్సిపల్‌ సాధారణ సమావేశాలను గుట్టుచప్పుడు కాకుండా ముగించేస్తున్నారు. పాలకవర్గం వచ్చినప్పటి నుంచి సాధారణ సమావేశాలు నిర్వహించామా లేదా అన్నట్లుగా ఉండటం తప్ప వికారాబాద్‌ అభివృద్ధిపై ఏ అంశాలు మాట్లాడారు? ఎన్ని నిధులు కేటాయిస్తున్నారు? అనే విషయాలు పాలకవర్గం, మున్సిపల్‌ అధికారులకు తప్ప పట్టణ ప్రజలకు మాత్రం తెలియనివ్వడం లేదు. ప్రభుత్వం సమావేశాలకు మీడియాను అనుమతించకుండా జీవో తీసుకొచ్చినప్పటికీ సమావేశం అనంతరం చైర్మన్‌, కమిషనర్‌తో సమావేశంలో జరిగిన అంశాలను సమావేశం అనంతరం విలేకరులకు తెలియజేయాలని జీవో ఉన్నప్పటికీ వికారాబాద్‌ మున్సిపాలిటీలో మాత్రం అమలు కావడం లేదు. కాగా, గురువారం మున్సిపల్‌ సమావేశం నిర్వహించారు. అయితే, మున్సిపల్‌ కార్యాలయం ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా మారింది. సమాచార విషయమై అధికారులకు ఫోన్‌ చేసినా స్పందించడం లేదు.

Updated Date - 2021-12-31T05:21:28+05:30 IST