డంపింగ్ యార్డులో మంటలు
ABN , First Publish Date - 2021-12-31T05:16:01+05:30 IST
డంపింగ్ యార్డులో మంటలు

షాద్‌నగర్: పట్టణ మున్సిపల్ పరిధి సోలీపూర్ డం పింగ్ యార్డుపై రోజురోజూకు వివాదం రేగుతోంది. డం పింగ్ యార్డు నుంచి వచ్చే దుర్వాసన, చెత్తాచెదారంతో తమ ఆరోగ్యానికి హాని కలుగుతోందని ప్రజలు వాపోతు న్నారు. షాద్‌నగర్‌లో సేకరించిన చెత్తనే కాకుండా పరిశ్రమల్లో పేరుకుపోయిన చెత్తను కూడా రాత్రుళ్లు ఇక్కడే డంప్ చేస్తున్నారని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డంపింగ్ యార్డును తరలించాలని పలుమార్లు మున్సిపల్ అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదంటున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే తామంతా ఉద్యమనికి కూడా సిద్ధమని ప్రజలు హెచరిస్తున్నారు.
- తరలించే ప్రసక్తే లేదు ..
సోలీపూర్ డంప్‌యార్డును తరలించే ప్రసక్తే లేదని మున్సిపల్ కమిషనర్ జయంత్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశా రు. డంప్‌యార్డు కోసం ప్రభుత్వం కేటాయించిన స్థలంలోనే చెత్తను డంప్ చేస్తున్నామన్నారు. ఆకతాయిలు కావాలనే చెత్తను తగులబెట్టి ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. యార్డు చుట్టూ సీసీ కెమెరాలు బిగించాలని కలెక్టర్ ఆదేశించారని తెలిపారు.