పంట మార్పిడిపై అవగాహన పెంచుకోవాలి
ABN , First Publish Date - 2021-12-16T05:06:28+05:30 IST
పంట మార్పిడిపై అవగాహన పెంచుకోవాలి

ఘట్‌కేసర్ రూరల్ : రైతులు పంట మార్పిడిపై అవగాహన పెంపొందించుకుని అధిక లాభాలు పొందాలని ఎంపీపీ ఏనుగు సుదర్శన్‌రెడ్డి తెలిపారు. మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన 45మంది రైతులకు పంటల మార్పిడిపై అవగాహన కోసం ఎంపీపీ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా ములుగు మండలంలోని కొండా లక్ష్మణ్‌బాపూజీ హార్టికల్చర్ యూనివర్సిటీకి తీసుకెళ్ళారు. వారు అక్కడ వ్యవసాయ శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు తెలుసుకున్నారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి ఎంఏ బాసిత్, రైతు సమన్వయ సమితి మండలాధ్యక్షుడు అంజిరెడ్డి, సభ్యులు డొంకెని భిక్షపతిగౌడ్, జిల్లాల పోచిరెడ్డి, రైతులు ఏనుగు లక్ష్మారెడ్డి, దామోదర్‌రెడ్డి, మంకం శ్రీనివాస్, చిలకల నర్సింహ, ఏనుగు మశ్చేందర్‌రెడ్డి, దయాకర్‌రెడ్డి, ప్రవీణ్‌రెడ్డి, గడ్డం మహేష్, తదితరులు పాల్గొన్నారు.