తుర్రేబాజ్‌ఖాన్‌కు ఆశ్రయమిచ్చిన మొగిలిగిద్ద

ABN , First Publish Date - 2021-06-08T05:30:00+05:30 IST

తుర్రేబాజ్‌ఖాన్‌కు ఆశ్రయమిచ్చిన మొగిలిగిద్ద

తుర్రేబాజ్‌ఖాన్‌కు ఆశ్రయమిచ్చిన మొగిలిగిద్ద
నిజాం నవాబు కాలంలో పోలీ్‌సస్టేషన్‌గా వాడిన భవనం ఇదే..

  • అప్పట్లోనే చైతన్యం కలిగిన గ్రామంగా గుర్తించిన నిజాం
  • స్వాతంత్ర్యానికి పూర్వమే గ్రామంలో పోలీస్‌ స్టేషన్‌, పోస్టాఫీస్‌, పాఠశాల ఏర్పాటు
  • చెక్కుచెదరని నాటి కట్టడాలు
  • మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని స్థానికుల వాంఛ

షాద్‌నగర్‌ రూరల్‌: ఫరూఖ్‌నగర్‌ మండలం మొగిలిగిద్దలో భారతదేశ స్వాతంత్ర్యానికి పూర్వమే పోలీ్‌సస్టేషన్‌, పోస్టాఫీస్‌, పాఠశాల ఏర్పాటయ్యాయి. రజాకార్లు, నిజాం పాలనకు వ్యతిరేకంగా ఉద్యమించిన తుర్రేబాజ్‌ఖాన్‌ అప్పట్లో వారి నుంచి తప్పించుకునేందుకు వెళ్తూ మార్గ మధ్యలో మొగిలిగిద్దలో తలదాచుకున్నట్లు చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తోంది. చివరకు నిజాం నవాబు అతడిని పట్టుకెళ్లి హైదరాబాద్‌లో ఉరి తీసినట్లు చెబుతారు. తుర్రేబాజ్‌ఖాన్‌కు మొగిలిగిద్ద వాసులు ఆశ్రయమిచ్చారని తెలుసుకున్న నిజాం నవాబు తమక వ్యతిరేకంగా కుట్రలు చేయకూడదనే ఉద్దశంతో మొగిలిగిద్దలో పోలీ్‌సస్టేషన్‌ను నిర్మించారు. నాటి పోలీ్‌సస్టేషన్‌ భవనం నేటికీ చెక్కుచెదరలేదు. దానికి తుర్రేబాజ్‌ఖాన్‌ స్మారక గ్రంథాలయంగా నిర్వహించారు. 1985లో తెలుగుదేశం ప్రభుత్వం మండల వ్యవస్థ ఏర్పాటు చేయడంతో మొగిలిగిద్దలో ఉన్న పోలీస్‌ స్టేషన్‌ను మండలంగా ఏర్పాటైనా కొందుర్గుకు తరలించారు.


  • సమాచార వ్యవస్థ కోసం పోస్టాఫీస్‌ ఏర్పాటు..


మొగిలిగిద్ద గ్రామస్థులు చైతన్యం కలిగిన వారని గ్రహించిన నిజాం పాలకులు బట్వాడ(సమాచార) నిమిత్తం పోస్టాఫీ్‌సను ఏర్పాటు చేశారు. అధునాతనంగా డంగు సున్నం, ఫ్యాబ్రికేషన్‌ సామగ్రితో కట్టిన నిర్మించిన ఈ భవనం నేటికీ చూపరులను ఆకర్షిస్తోంది. వందేళ్లు దాటినా చెక్కుచెదర లేదు. మొగిలిగిద్ద పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని అన్ని గ్రామాల సమాచారాన్ని సిబ్బందితో నవాబులు రోజూ తెలుసుకునేవారు. ఇప్పటికి మొగిలిగిద్ద పోస్టాఫీస్‌ కేంద్రంగా ఉత్తర, ప్రత్యుత్తరాలు జరుగుతున్నాయి.


  • అప్పట్లోనే పాఠశాల నిర్మాణం ..


తమకు వ్యతిరేకంగా జనం కుట్రలు పన్నుతారనే అనుమానంతో నిజాం నవాబులు గ్రామస్థులను విద్యా పరంగా చైతన్యం చేయాలని వందేళ్ల కిందనే పాఠశాలను కట్టించారు. మొగిలిగిద్ద పాఠశాలలో చదివిన ఎంతో మంది ఉన్నతోద్యోగాలు సాధించారు. హైదరాబాద్‌ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు, ఉత్తర్‌ప్రదేశ్‌కు గవర్నర్‌గా పని చేసిన ఫరూఖ్‌నగర్‌ మండలం అన్నారం వాసి సత్యనారాయణరెడ్డి, ప్రొఫెసర్‌ హరగోపాల్‌ వంటి మేధావులు ఒక్కడ చదువుకున్న వారే. వీరేకకా మరెంతో మంది ఉన్నత విద్యావంతులు మొగిలిగిద్ద పాఠశాలలోనే చదువుకున్నారు. వందేళ్ల చరిత్ర కలిగిన పాఠశాల భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో ప్రభుత్వం నూతన భవన కోసం నిధులు మంజూరు చేసింది. టీడీపీ ప్రభుత్వం జూనియర్‌ కళాశాలను మంజూరైంది. అనంతరం కసూ ్తర్బా బాలికల పాఠశాల, కళాశాల ఏర్పాటైంది.


  • కలగానే మిగిలిన మొగిలిగిద్ద మండల కేంద్రం ఏర్పాటు


తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తరువాత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కొత్త జిల్లాలు, మండలాలు ఏర్పాటు చేసింది. మొగిలిగిద్దను కూడా మండల కేంద్రం ఏర్పాటు చేయాలని స్థానికులు 100 రోజులు దీక్షలు చేశారు. అయినా ప్రభుత్వం స్పందించలేదు. చరిత్ర కలిగిన మొగిలిగిద్దను మండలం చేస్తే పునర్వైభవం వస్తుందని ఆశించారు. రెండు నెలల కింద రెండు కొత్త మండలాలేర్పాటు చేసిన సమయంలో ప్రభుత్వం పరిగణించ లేదు. మొగిలిగిద్ద మండలం కావాలని స్థానికుల చిరకాల వాంఛ!

Updated Date - 2021-06-08T05:30:00+05:30 IST