వందకోట్ల వ్యాక్సిన్‌ డోసులు అందించిన ఘనత మోదీదే

ABN , First Publish Date - 2021-10-20T04:40:22+05:30 IST

వందకోట్ల వ్యాక్సిన్‌ డోసులు అందించిన ఘనత మోదీదే

వందకోట్ల వ్యాక్సిన్‌ డోసులు అందించిన ఘనత మోదీదే
వికారాబాద్‌: సమావేశంలో మాట్లాడుతున్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు సదానందరెడ్డి

  • బీజేపీ జిల్లా అధ్యక్షుడు సదానందరెడ్డి 


వికారాబాద్‌/కులకచర్ల/దోమ: దేశంలో వంద కోట్ల వ్యాక్సిన్‌ డోసులు అందించిన ఘనత ప్రధాని మోదీదే నని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సదానందరెడ్డి అన్నారు. పట్టణంలో మంగళవారం మండల మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రపంచంలో 75శాతం మందికి వ్యాక్సిన్‌ డోసులు అందించిన మొదటి దేశం భారతదేశం అని, అమెరికా లాంటి దేశంలో కూడా 20కోట్ల డోసులు మాత్రమే పూర్తి చేయగలిగారని గుర్తుచేశారు. బ్రెజిల్‌, జపాన్‌, ఇండోనేషియా, ఇంగ్లాండ్‌, కెనడా లాంటి అభివృద్ధి చెందిన దేశాలలో సైతం ఈస్థాయిలో వ్యాక్సినేషన్‌ పూర్తి చేయలేదన్నారు. భారతదేశం స్వయంగా దేశీయ ఉత్పత్తితో ఈ ఘనత సాధించిందని అన్నారు. ప్రపంచంలో 190 దేశాలకు 130 దేశాలు వ్యాక్సిన్‌ని ఎగుమతి చేసుకుంటున్నాయని అయితే మన దేశ అవసరాలు తీరిన తర్వాతే ఇతర దేశాలకు ఎగుమతి చేయాలని భారత ప్రభుత్వం నిర్ణయించిందని వివరించారు. ఈనెలలో సుమారుగా కోవీషీల్డ్‌ 22కోట్లు, కోవ్యాక్సిన్‌ 6కోట్లు డోసులు ప్రభుత్వానికి అందుబాటులో ఉన్నాయని తెలిపారు. సమావేశంలో వికారాబాద్‌ మండల ఇన్‌చార్జి భరత్‌కుమార్‌, మోమిన్‌పేట ఇన్‌చార్జి శ్రీధర్‌రెడ్డి, వికారాబాద్‌ మండల ప్రధాన కార్యదర్శి రవీందర్‌రెడ్డి, కిసాన్‌మోర్చా అధ్యక్షుడు మహిపాల్‌రెడ్డి, కోశాధికారి బస్వలింగం, బీజేపీ నాయకులు నర్సింహారెడ్డి, రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు. అదేవిధంగా కులకచర్లలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ప్రహ్లాద్‌రావు మాట్లాడుతూ ప్రతిఒక్కరూ కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేసుకోవాలన్నారు. వంద కోట్ల మందికి డోస్‌లను ఉచితంగా అందిస్తున్న నేపథ్యంలో ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఎంతో మంది ఆరోపణలు ఎదుర్కొంటూ ఉచితంగా వ్యాక్సిన్‌ అందిస్తూ ప్రపంచ దేశాల్లో మెప్పు పొందుతోందని తెలిపారు. ప్రపంచ దేశాలు భారత్‌ వైపు చూస్తున్నాయని, ప్రతిపక్షాలు చిన్నసంఘటనలు పట్టుకొని రాద్దాంతాలు చేస్తున్నాయని తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటయ్యగౌడ్‌, మండల పార్టీ అధ్యక్షుడు మైపాల్‌, ప్రధాన కార్యదర్శి హన్మంతు పాల్గొన్నారు. అదేవిధంగా దోమ చౌరస్తాలో బీజేపీ పార్టీ మండల అధ్యక్షుడు రాంరెడ్డి, నర్సింహులు సమావేశం నిర్వహించి ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో మహేశ్‌, మణికంఠ, ప్రతాప్‌, గోవర్దన్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-20T04:40:22+05:30 IST