నిరాడంబరంగా లక్ష్మీనరసింహస్వామి ఆలయ వార్షికోత్సవం

ABN , First Publish Date - 2021-05-09T05:26:01+05:30 IST

నిరాడంబరంగా లక్ష్మీనరసింహస్వామి ఆలయ వార్షికోత్సవం

నిరాడంబరంగా లక్ష్మీనరసింహస్వామి ఆలయ వార్షికోత్సవం
స్వామివారికి పట్టువస్ర్తాలు అందజేస్తున్న మంత్రి మల్లారెడ్డి

  • స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి మల్లారెడ్డి దంపతులు 

కీసర: సంకల్పసిద్ధిగా పేరుగాంచిన చీర్యాల్‌ లక్ష్మీనరసింహస్వామి ఆలయ 13వ వార్షికోత్సవాలు శనివారం నిరాడంబంరంగా ప్రారంభమయ్యాయి. గణపతి పూజతో ప్రారంభమైన ఉత్సవానికి రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి దంపతులు విచ్చేసి స్వామివారికి పట్టువస్ర్తాలు సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి దంపతులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆనంతరం ఆలయ చైర్మన్‌ మల్లారపు లక్ష్మీనారాయణ, ధర్మకర్త శ్రీహరిగౌడ్‌లు మంత్రి మల్లారెడ్డి దంపతులను శాలువాతో సత్కరించి, స్వామివారి జ్ఞాపికను అందజేశారు. కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు.

Updated Date - 2021-05-09T05:26:01+05:30 IST