మల్లన్నస్వామి సేవలో ఎమ్మెల్యే యాదయ్య

ABN , First Publish Date - 2021-03-22T05:42:09+05:30 IST

మల్లన్నస్వామి సేవలో ఎమ్మెల్యే యాదయ్య

మల్లన్నస్వామి సేవలో ఎమ్మెల్యే యాదయ్య
నవాబుపేట: దాతాపూర్‌లో మల్లన్న స్వామిని దర్శించుకుంటున్న చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య

నవాబుపేట: మండలంలోని దాతాపూర్‌లో జరుగుతున్న మల్లన్న స్వామి జాతర ఉత్సవాల్లో ఆదివారం చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య పాల్గొన్నారు. మండల టీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులతో కలిసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేకపూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఆయనవెంట టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు నాగిరెడ్డి, నవాబుపేట సర్పంచ్‌ విజయలక్ష్మి ప్రకాశం, దాతాపూర్‌ సర్పంచ్‌ బల్వంత్‌రెడ్డి, పార్టీ యూత్‌ మండలాధ్యక్షుడు శాంతికుమార్‌ పాల్గొన్నారు. 

మల్లికార్జున స్వామి కల్యాణం

ఘట్‌కేసర్‌ రూరల్‌: కాచవానిసింగారంలో ఆదివారం మల్లికార్జునస్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా కల్యాణోత్సవాన్ని నిర్వహించారు. మండపంపై మల్లికార్జునస్వామిని, భ్రమరాంభిక విగ్రహాలను ప్రతిష్ఠించి ఒగ్గుకళాకారులు కల్యాణోత్సవం జరిపించారు. జిల్లా పరిషత్‌ చైర్మన్‌ మలిపెద్ది శరత్‌చంద్రారెడ్డి, ఎంపీపీ సుదర్శన్‌రెడ్డి, సర్పంచు వెంకట్‌రెడ్డి స్వామివారికి పూజలు నిర్వహించారు. ఉపసర్పంచు విష్ణుగౌడ్‌ అన్నదానం ఏర్పాటు చేశారు. ఆలయ కమిటీ చైర్మన్‌ తర్రె మల్లే్‌షయాదవ్‌, కార్యదర్శి యాదయ్య, కోశాధికారి ఆంజనేయులుగౌడ్‌, వార్డుసభ్యులు లక్ష్మీశ్రీ, మహేష్‌, సుదర్శన్‌, శ్యాం, రజిత, నాయకులు మశ్చేందర్‌రెడ్డి, నాగరాజు, బాలుయాదవ్‌ పాల్గొన్నారు. 

రామలింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు

మేడ్చల్‌: మేడ ్చల్‌ రామలింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు కనులపండువగా కొనసాగుతున్పాయి . ఆదివారం గణపతి హోమం, అభిషేకం, రాత్రి అశ్వవాహన సేవ కార్యక్రమాలు నిర్వహించారు. సోమవారం రాత్రి 8గంటలకు కల్యాణోత్సవాన్ని నిర్వహిస్తామని ఆలయ ధర్మకర్త కాశీనాథ్‌ తెలిపారు.

గౌడవెల్లిలో బోనాలు

మేడ్చల్‌ మండలంలోని గౌడవెల్లిలో ఆదివారం మహిళలు పోచమ్మకు బోనాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ సురేందర్‌, గ్రామస్థులు పాల్గొన్నారు.

రేపటి నుంచి శ్రీలక్ష్మీనరసింహస్వామి జాతర 

మోమిన్‌పేట: మండలంలోని వెల్‌చాల్‌ ఆమ్రంలోని శ్రీ లక్షీనరసింహస్వామి జాతర మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. 4 శుక్రవారాలు ఈ కొండకు వచ్చి స్వామి వారిని దర్శించుకుంటే మంచి జరుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. వికారాబాద్‌ నుంచి సదాశివపేట వెళ్లే మార్గ మధ్యలో, మోమిన్‌పేట నుంచి 6 కిలోమీటర్ల దూరంలో వెల్‌చాల్‌ గ్రామం వస్తుంది. అక్కడి నుంచి 2 కిలోమీటర్ల దూరంలో పులిలొంక గుట్ట,  శ్రీలక్ష్మీ నరసింహాస్వామి దేవాలయం దర్శనమిస్తుంది.  ఒకప్పుడు పులులు సంచరించడంతో ఈ ప్రాంతాన్ని పులిలొంకగా పిలిచేవారు.  పరమయ్యదాసు అనే వ్యక్తి ఈ గుట్టకు పశువులను మేపేందుకు వెళ్లేవారు. వర్షం వస్తే తలదాచుకునేందుకు గుట్టను తొలిచి గుహలుగా మలిచారు. అదే వెల్‌చాల్‌ గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహాస్వామి దేవాలయం. కొండపై లక్ష్మీ నరసింహాస్వామితో పాటు ఆంజనేయస్వామి, వేంకటేశ్వర, బద్రినాథ్‌, మల్లికార్జున, నగేశ్వర స్వామి ఆలయాలు భక్తులకు దర్శనమిస్తున్నాయి. 

Updated Date - 2021-03-22T05:42:09+05:30 IST